భలే మొనగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలే మొనగాడు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
కృష్ణ కుమారి
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
నిర్మాణ సంస్థ సునందినీ పిక్చర్స్
భాష తెలుగు

భలే మొనగాడు అనే జానపద చిత్రాన్ని పి.మల్లిఖార్జునరావు సునందిని పిక్చర్స్ పతాకంపై 1968లో రూపొందించాడు. జానపద బ్రహ్మగా వాసిగాంచిన బి.విఠలాచార్య దీనికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 1968, జూలై 12వ తేదీన విడుదల అయ్యింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, మాటలు: వీటూరి
  • సంగీతం- ఎస్.పి.కోదండపాణి
  • నృత్యం- చిన్ని, సంపత్
  • స్టంట్స్- ఇ.పరమశివం
  • కళ- బి.నాగరాజు
  • కూర్పు- బి.కందస్వామి
  • ఛాయాగ్రహణం- హెచ్.ఎస్.వేణు
  • స్పెషల్ ఎఫెక్ట్స్- రవికాంత్ నగాయిచ్
  • నిర్మాత- పి.మల్లిఖార్జునరావు

విజేతపుర మహారాజు (జూనియర్ ఏ.వి.సుబ్బారావు). రాకుమార్తె వైశాలిదేవిని వివాహం చేసుకోవాలని, గోకర్ణుడు (రామదాసు) వికర్ణుడు (వి.జె.శర్మ) రాజ్యానికి వస్తారు. జగన్మాతను పూజించి నిర్ణయం చెబుతానన్న రాకుమారికి ఆలయంలో ఒక చిలుక కన్పించి, రేపు సభలో మాత నిర్ణయం చెబుతుందని తెలియచేస్తుంది. ఆలయంలో రాకుమారికి విజయసేనుడు (కాంతారావు) అనే యువకుడు పరిచయమై, ఆమె ప్రేమను పొందుతాడు. మరునాడు రాజ్యసభలో వరులిద్దరూ, సభాసదులు వుండగా చిలకవచ్చి భోగాపురంలోగల మాట్లాడే పువ్వు, రాగాపురంలోని సంగీతం పాడే కొమ్మ పెనుశిల కాట్లాడే బొమ్మ, ఈ మూడు విచిత్ర వస్తువులు ఎవరుతెస్తే వారిని రాకుమారి వివాహం చేసుకుంటుందని, దేవి ఆనతిగా ప్రకటిస్తుంది. ఒక ఏడాది గడువులోగా వాటిని తెస్తామని గోకర్ణ, వికర్ణులు, విజయసేనుడు బయలుదేరుతారు. విజయసేనుడు, తన మేనత్త కొడుకు అని తెలిసికొన్న వైశాలి (కృష్ణకుమారి) ఆనందిస్తుంది. విజయుడు, తన స్నేహితుడు ప్రేమికుడు (చలం)తో బయలుదేరి, దారిలో ఓ మండూకుని, అతని కుమార్తె బిజిలి (విజయలలిత)ని కలుస్తారు. వారి సాయంతో ఈ వస్తువుల జాడ గ్రహించి తొలుత సంధ్యారాణి వద్దగల మాట్లాడే పువ్వును, ఆపైన గీతాంజలి, ఆమె అన్నవద్దగల సంగీతం పాడే కొమ్మను, ఆ తరువాత, తన గానంతో పెను శిలను కరిగించి కాట్లాడే బొమ్మను సాధించి మహారాజుకు చూపటం, వీటిపై ఆశపడి చిలక రూపంలో వీటిని కోరిన ఘంటా భైరవుడు (త్యాగరాజు) వాటిని విజయసేనునివద్దనుంచి తస్కరించటం, తిరిగి విజయుడు తనకు తెలిసి పరాక్రమంతో వాటిని నాశనంచేసి, ఆ మాంత్రికుని అంతంచేయటం జరుగుతుంది. వైశాలినియొక్క తప్పిపోయిన సోదరి బిజిలి అని తెలిసాక, వైశాలికి, బిజిలికి, విజయసేనునితో వివాహం జరిగి అందరూ ఆనందించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

చిత్ర గీతాలు

[మార్చు]

ఈ చిత్రంలోని గీతాలను సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర రచించగా ఎస్.పి.కోదండపాణి స్వరకల్పన చేశాడు. ఘంటసాల, పి.సుశీల, జిక్కి తదితరులు ఆలపించారు. ఈ సినిమాలోని పాటల వివరాలు:

  1. ఏ ఊరు నీ పయనం చక్కని మగరాయా ఏ భామ - పి.సుశీల, ఘంటసాల-ఆరుద్ర
  2. ఇంద ఇంద తీసుకో - పి.సుశీల - ఆరుద్ర
  3. కవ్వించేలేరా జువ్వను లేలేరా - పి.సుశీల, జిక్కి - సి.నారాయణరెడ్డి
  4. మనిషి తలచుకుంటే గిరులు ఝరులు పొంగవా - ఘంటసాల - సి.నారాయణరెడ్డి
  5. ఏలుకొనురాజు ఎప్పుడొస్తాడో - పి.సుశీల బృందం - దాశరథి
  6. సిన్నదాన్నిరా నీ సిన్నదాన్నిరా - పి.సుశీల - దాశరథి

మూలాలు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]