శ్రీరంజని (జూనియర్)
స్వరూపం
జూనియర్ శ్రీరంజని | |
---|---|
జననం | మహాలక్ష్మి 1927 ఫిబ్రవరి 22 మురికిపూడి, గుంటూరు జిల్లా |
మరణం | 1974 ఏప్రిల్ 27 | (వయసు 47)
బంధువులు | శ్రీరంజని (సీనియర్) |
శ్రీరంజని పేరుతో ఉన్న ఇతర వ్యాసాల కొరకు, శ్రీరంజని చూడండి.
శ్రీరంజని (అసలు పేరు మహాలక్ష్మి) తెలుగు సినిమా నటి. వీరు గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో 1927 సంవత్సరం ఫిబ్రవరి 22 న జన్మించారు. శ్రీరంజని సీనియర్ గా పేరుపొందిన తెలుగు సినిమా నటి ఈమె సోదరి. చిత్రపు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మొదటిసారిగా భీష్మ (1944) చిత్రంలో నటించింది. 1949లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో విడిదలైన గుణసుందరి కథలో కథానాయిక పాత్రలో నటించింది. ఈమె 1974 సంవత్సరంలో ఏప్రిల్ 27 న మరణించింది.
నటించిన చిత్రాలు
[మార్చు]- జీవన తరంగాలు (1973)
- నేనంటే నేనే (1968)
- బంగారు పంజరం (1965)
- శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) .... రుక్మిణి
- మహాకవి కాళిదాసు (1960)
- కృష్ణ లీలలు (1959)
- ప్రేమే దైవం (1957)
- శ్రీ గౌరీ మహత్యం (1956)
- పెంకి పెళ్ళాం (1956)
- సంతానం (1955) .... లక్ష్మి
- శ్రీకృష్ణ తులాభారం (1955) .... రుక్మిణి
- చంద్రహారం (1954) .... గౌరి
- అమర సందేశం (1954)
- పెద్ద మనుషులు (1954)
- బ్రతుకు తెరువు (1953)
- మానవతి (1952)
- పరాశక్తి (1952) .... కళ్యాణి
- ప్రేమ (1952) .... లత
- రాజేశ్వరి (1952)
- సంక్రాంతి (1952)
- లైలా మజ్ఞు (1949)
- గుణసుందరి కథ (1949) .... గుణసుందరి
- గీతాంజలి (1948)
- మదాలస (1948)
- గృహప్రవేశం (1946)
- భీష్మ (1944) .... సత్యవతి