బంగారు పంజరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు పంజరం
(1969 తెలుగు సినిమా)
TeluguFilm Bangaru Panjaram.jpg
దర్శకత్వం బి.ఎన్.రెడ్డి
నిర్మాణం బి.ఎన్.రెడ్డి
తారాగణం వాణిశ్రీ (నీల),
శోభన్ బాబు (వేణు),
శ్రీరంజిని,
సత్యనారాయణ,
రావి కొండలరావు,
బేబి రాణి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు &
బి.గోపాలం
నేపథ్య గానం ఘంటసాల,
ఎస్. జానకి
ఛాయాగ్రహణం కొండారెడ్డి
కళ ఎ. కె. శేఖర్
నిర్మాణ సంస్థ వాహిని ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బంగారు పంజరం 1969, మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా విడుదలైన తెలుగు సినిమా.

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, మాటలు: పాలగుమ్మి పద్మరాజు
 • పాటలు: దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
 • కళ: ఎకె శేఖర్
 • కూర్పు: ఎంఎస్ మణి
 • ఛాయాగ్రహణం: బిఎస్ కొండారెడ్డి, సిఎస్ మహి
 • నృత్యం: వెంపటి చినసత్యం
 • శబ్దగ్రహణం: వి శివరాం
 • నిర్మాత, దర్శకుడు: బిఎన్ రెడ్డి.

తారాగణం[మార్చు]

 • శోభన్‌బాబు
 • గీతాంజలి
 • వాణిశ్రీ
 • శ్రీరంజని
 • రావికొండలరావు
 • పుష్పవల్లి
 • నవీనలక్ష్మి
 • త్యాగరాజు
 • ఉదయలక్ష్మి
 • బేబి రాణి
 • పిజె శర్మ
 • కాకరాల
 • వల్లభనేని శివరాం
 • టి.జి.కమలాదేవి
 • ఝాన్సీ
 • రావుగోపాలరావు
 • సిహెచ్ కృష్ణమూర్తి
 • పొట్టిప్రసాద్
 • పండరీబాయి

కథ[మార్చు]

హైద్రాబాదులో ఇంజనీరు వేణుగోపాలరావు (శోభన్‌బాబు). అతని తల్లి (శ్రీరంజని). మేనమామ రామకోటయ్య (రావికొండలరావు), అతని భార్య గౌరి (పుష్పవల్లి), వారి కుమార్తె పద్మ (గీతాంజలి). వారింట దాసి మంధర (నవీనలక్ష్మి). ప్రాజెక్టు పనిమీద శ్రీశైలం వెళ్లిన వేణుకు అక్కడి గ్రామీణ యువతి నీల (వాణిశ్రీ) పరిచయమవుతుంది. ఆమె అందం, అమాయకత్వం చూసి ఇష్టపడిన వేణు, ఆమె తల్లిదండ్రులు త్యాగరాజు, ఉదయలక్ష్మిలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు చదువు, నాగరికత నేర్పుతాడు. వారికొక పాప బుజ్జి (బేబీరాణి). ఎలాగైనా వేణును తన అల్లుడిని చేసుకోవాలన్న రామకోటయ్య ఆశ నెరవేరకపోవటంతో, దాసి మంధర సాయంతో ఆ కార్యం సాధించాలనుకుంటాడు. ఆమె కుట్రలు, మాయోపాయాల కారణంగా నీలను వేణు నిందించటం, తూలనాడటం జరుగుతుంది. ఇదంతా పద్మపై ఇష్టంతో వేణు చేస్తున్నాడని భావించిన నీల ఇల్లు విడిచి వెళ్తుంది. తరువాత నిజం గ్రహించిన వేణు ఆమె కొరకు అనే్వషించి, రైలు ప్రమాదంలో నీల మరణించిందని భావించి మతిస్థిమితం కోల్పోతాడు. రైలు ప్రమాదం నుంచి బయటపడిన నీల నర్సుగా ఓ చోట పనిచేస్తూ, అక్కడి డాక్టరు ద్వారా భర్త గురించి తెలుసుకుంటుంది. తానెవరో తెలియనీయకుండా, అతన్ని తన సేవతో, పాటతో మామూలు మనిషిని చేస్తుంది. తల్లి, భార్య, కూతురితో వేణు దేవిని శివాలయంలో పూజించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.

పాటలు[మార్చు]

 1. జో కొడుతూ కథ చెబితే ఊ కొడుతూ వింటావా - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 2. కొండల కోనల సూరీడు కురిసే బంగారు నీరు విరిసి ఉరకేసే ఏరు - ఎస్. జానకి బృందం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 3. గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో నల్లకనుల నాగస్వరం ఊదేరెవరో - ఎస్. జానకి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 4. పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా రాతిరి నా రాజువురా - ఎస్. జానకి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 5. మనిషే మారేరా రాజా మనసే మారేరా మనసులో నా మనసులో - ఎస్. జానకి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 6. శ్రీశైల భవనా! భ్రమరాంబా రమణా... ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
 7. నీ పదములె చాలు రామ ! నీ పద ధూళులే పదివేలు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు[మార్చు]