పెద్దమనుషులు (1954 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెద్దమనుషులు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.రెడ్డి
నిర్మాణం కె.వి.రెడ్డి
కథ కె.వి.రెడ్డి,
డి.వి.నరసరాజు,
డి.బి.జి.తిలక్
తారాగణం జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
ఎ.వి.సుబ్బారావు,
ఎమ్.లింగమూర్తి,
వంగర,
రేలంగి,
సి.హెచ్.కుటుంబరావు,
రామచంద్ర కాశ్యప్,
గోపాల్ పిళ్ళై,
శ్రీరంజని,
కె.పద్మావతిదేవి,
సి.హెచ్.హేమలత,
తాడంకి శేషమాంబ,
స్వరాజ్యలక్ష్మి,
ప్రభావతి,
జయలక్ష్మి,
సీత
సంగీతం ఓగిరాల రామచంద్రరావు,
అద్దేపల్లి రామారావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.లీల,
కృష్ణవేణి(జిక్కి),
పి.నాగేశ్వరరావు,
మాధవపెద్ది,
వర్మ
నృత్యాలు వి.జె.శర్మ
గీతరచన ఊటుకూరి సత్యనారాయణరావు,
కొసరాజు రాఘవయ్య చౌదరి,
ఎన్.రాఘవరావు
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం బి.ఎన్.కొండారెడ్డి
కళ ఎ.కె.శేఖర్
కూర్పు ఎమ్.ఎస్.మణి
నిర్మాణ సంస్థ వాహినీ ప్రొడక్షన్స్
నిడివి 191 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పెద్దమనుషులు హెన్రిక్ ఇబ్సెన్ (Henrik Ibsen) రచించిన 'ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ' (The Pillars of Society)[1] అనే నాటకం ఆధారంగా నిర్మితమైన తెలుగు చిత్రం. ఇది తర్వాత అనేక తెలుగు సినిమాలకు ఆధారమైనది. పల్లెటూరు, అక్కడి రాజకీయాలు, రాజకీయం చాటున పెద్దమనుషుల దోపిడీ, అది ఎదుర్కునే వారి అడ్డు తొలగింపులు చిత్ర కథాశం. గౌరీనాథశాస్త్రి నటన చూస్తే, ఆయన మరిన్ని చిత్రాల్లో నటించి ఉంటే తెలుగు చిత్రసీమ మరింత సంపన్నమై ఉండేదనిపిస్తుంది. ఎస్వి రంగారావు, గుమ్మడి, రావుగోపాలరావులు కలిసి గౌరీనాథశాస్త్రిలో కనిపిస్తారు. రేలంగి తను ధరించిన పాత్రలలో ఉత్తమమైనది గా ఈ చిత్రంలోని పాత్ర గురించి చెప్పారు. ఈ పాత్ర తర్వాత ఒక మోడల్ గా మారిపోయింది. (దేశోద్ధారకుల్లో పద్మనాభం పాత్ర నుండి ప్రతిఘటన లో వేలు పాత్ర వరకు)

విడుదల, స్పందన[మార్చు]

1954లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయవంతమైంది. విమర్శకుల నుంచి ప్రశంసలను కూడా సాధించగలిగింది. సినిమా రంగం అనే అలనాటి సినీ పత్రిక అప్పట్లో 1954లో విడుదలైన ఉత్తమ చిత్రం ఏదంటూ పాఠకుల స్పందన కోరగా వారు పెద్దమనుషులు సినిమాను ఎంచుకున్నారు.[2]

పాటలు[మార్చు]

  • శివ శివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు గణనాధా
  • నందామయా గురుడ నందామయా ఆనందదేవికీ నందామయా

మూలాలు[మార్చు]

  1. [1]
  2. "1954 సం.లో ఉత్తమ చిత్రం". సినిమా రంగం. ఏప్రిల్ 1955. Retrieved 25 July 2015.  Check date values in: |date= (help)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు[మార్చు]


కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య