సత్య హరిశ్చంద్ర (1965 సినిమా)
స్వరూపం
| సత్య హరిశ్చంద్ర (1965 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.వి.రెడ్డి |
|---|---|
| నిర్మాణం | కె.వి.రెడ్డి |
| తారాగణం | నందమూరి తారక రామారావు, ఎస్. వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, మాష్టర్ బాబు, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ పుణ్యమూర్తుల రాజబాబు, వల్లూరు బాలకృష్ణ |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | విజయా ప్రొడక్షన్స్ |
| విడుదల తేదీ | ఏప్రిల్ 22, 1965 |
| భాష | తెలుగు |
సత్య హరిశ్చంద్ర విజయా పతాకంపై కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల వంటి తారాగణంతో కూడిన 1965 నాటి పౌరాణిక చలనచిత్రం. సత్యం యొక్క గొప్పదనాన్ని సందేశంగా కలిగిన హరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాథను సినిమాగా మలిచారు. ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పాలైంది.
స్పందన
[మార్చు]సత్య హరిశ్చంద్ర సినిమా భారీ పరాజయాన్ని పొందింది. ఎన్.టి.రామారావు, నాగయ్య వంటి నటులతో కూడిన భారీతారాగణం, కె.వి.రెడ్డి లాంటి ప్రఖ్యాత దర్శకుడు, విజయ ప్రొడక్షన్స్ వంటి విజయవంతమైన నిర్మాణ సంస్థ ఉన్నా ఆర్థికంగా విజయవంతం కాలేదు.[1]
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_ హరిశ్చంద్రుడు
- ఎస్.వరలక్ష్మి_ చంద్రమతి
- ఉప్పలదడియం నాగయ్య_ వశిష్ఠ మహర్షి
- ముక్కామల కృష్ణమూర్తి_ బ్రహ్మర్షి విశ్వామిత్ర
- రాజనాల కాళేశ్వరరావు_ వీరబాహుడు
- రేలంగి వెంకట్రామయ్య_కాలకౌసికుడు
- తిక్కవరపు వెంకట రమణారెడ్డి_నక్షత్రకుడు
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి_ ఇంద్రుడు
- మందాడి ప్రభాకరరెడ్డి_ లార్డ్ శివ
- చదలవాడ_వేలం వేయువాడు
- పుణ్యమూర్తుల రాజబాబు_కాలకౌసీకుడు శిష్యుడు
- వల్లూరి బాలకృష్ణ_కాలకౌసీకుడు శిష్యుడు
- నల్ల రామమూర్తి_కాలకౌసికుడు శిష్యుడు
- రామకోటి_కాలకౌసికుడు శిష్యుడు
- ఏ.వి.సుబ్బారావు జూనియర్_ సత్యకీర్తి
- గిరిజ_కలహకంటి
- ఎల్.విజయలక్ష్మి_మేనక
- మీనాకుమారి
- వాణిశ్రీ_ మాతంగి
- రాజశ్రీ_ మాతంగి కన్య
- మోహన_ కాశీరాణి
- సబితాదేవి_ పార్వతీదేవి
- మాస్టర్ బాబు_ లోహితాసుడు .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కదిరి వెంకటరెడ్డి
- స్క్రీన్ ప్లే: కె.వి.రెడ్డి
- కధ: పింగళి నాగేంద్రరావు
- మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- నేపథ్య గాయకులు: పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, ఎస్.వరలక్ష్మి, బి.గోపాలం
- ఛాయా గ్రహణం: కమల్ ఘోష్
- ఎడిటింగ్: జి.కళ్యాణ సుందరం, డి.జి.జయరాం
- నిర్మాత: కె.వి.రెడ్డి
- నిర్మాణ సంస్థ: విజయా ప్రొడక్షన్స్
- విడుదల:22:04:1965.
పాటలు
[మార్చు]- అందాల తనయా ఆనంద నిలయా ఇనవంశమణి వీవెరా దినదినము - ఎస్. వరలక్ష్మి
- అదిగో భానుప్రభలు చిమ్ముచు కనులన్‌గ్రమ్మి అనర్ఘ (పద్యం) - ఘంటసాల
- ఆడనీవు ఈడనేను సూసుకుంటు కూసుంటే ఎన్నాళ్ళు - స్వర్ణలత,రాజనాల మాటలతో
- ఈశ్వరా జగదీశ్వరా ఏమి ఖర్మము పట్టెరా ఎవరి కోపమొ ఎవరి పాపమొ - ఘంటసాల
- కలలోననైన నవ్వులకైన ఏనాడు అనృతమంబు పలుకని - ఘంటసాల
- కాలకౌశికు ముందు తలయెత్త గలవాడు ఎవడు వాడెవడు - మాధవపెద్ది బృందం
- కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా - ఘంటసాల బృందం
- తద్దినంపు భోజనం తలచుకుంటె చాలురా నోరూరు చుండెరా - బి. గోపాలం బృందం
- తాళి కట్టిన చేత తరుణి కంఠము త్రుంచు వింత యోగము (పద్యం) - ఘంటసాల
- ధిల్లాన - పి.లీల,గాయకుడు ?
- హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే సాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో, .. నమో భూతనాధ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి
- నానా దేవ ధనంబులున్ ద్విజుల మాన్యంబుల్ వినా భురిసమస్త (పద్యం) - ఘంటసాల
- నీవు మాకు చిక్కినావులే రాజా మేము నీకు దక్కినాములే - సుశీల, పి.లీల
- భువిలోని మునులు .. అందాల తనయా ఆనంద ( విషాదం ) - ఎస్. వరలక్ష్మి
- భవవేద సారా సదా నిర్వికారా ..నమో భూతనాధ నమో దేవదేవ - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి బృందం
- లొకబాంధవా సర్వలోకైక వంద్య నాకు వేవేల జన్మములయందు (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- వందే సురాణాం సారంచ సురేశం నీల లోహితం (శ్లోకం) - ఘంటసాల
- వంశమును నిల్పుకొరకే వివాహమనుచు అగ్నిసాక్షిగ పరిణయ (పద్యం) - ఘంటసాల
- విధి విపరీతం విధి విడ్డూరం విధి విలాసమన ఇదేకదా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి,పి. లీల
- శ్రీమన్మహా దివ్యతేజో విరాజీ కృపాళూ జగజ్జాల రక్షా - ఎస్. వరలక్ష్మి
- సత్యమునకెందు భంగము జరుగువేళ నీవెకదా సర్వరక్ష (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- సత్యంబు పాలింప సర్వరాజ్యము వీడి ఆలుబిడ్డలతోడ (పద్యం) - ఘంటసాల
పాటలు
[మార్చు]- కులంలో ఏముందిరా సోదరా, మతంలో ఏముందిరా
- మట్టిలో కలిసేటి మడీసీ మడిసికి భేదం ఏముంది ఏముందిరా !
- నిలువు బొట్టుతో స్వరగం రాదురా, అడ్డ బొట్టుతో నరకం పోదురా
- జుట్టూ బొట్టూ కట్టూలన్నీ పాడెకట్టుతో ఎగిరిపోవురా
- జంగాలంతా శివుడే యంటరు దాసరులౌతే భవుడే యంటరు
- జంగము దాసరి జగడమాడుకొని వల్లకాటిలో ఒకటై పోదురు
- తలకో మతముగా నీతులు గీతులు బోధలు చేసే స్వాములు చివరకు
- కాటిరేడు ఈ వీరబాహుని చేతి మీదుగా బూడిదవుదురు
- ---పింగళి నాగేంద్రరావు,ఘంటసాల,పెండ్యాల నాగేశ్వర రావు, 1965 సత్యహరిశ్చ౦ద్ర,
మూలాలు
[మార్చు]- ↑ ఎం.బి.ఎస్., ప్రసాద్. "రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 13 July 2015.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల' అనే పాటల సంకలనం నుంచి.
| కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
|---|---|
| భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య |