ఉమా చండీ గౌరీ శంకరుల కథ
Appearance
ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి, రేలంగి, ముక్కామల, సురభి కమలాబాయి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
గీతరచన | పింగళి |
నిర్మాణ సంస్థ | సుందరం మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఉమా చండీ గౌరీ శంకరుల కథ కె.వి.రెడ్డి దర్శకత్వం వహించగా, ఎన్.టి.రామారావు, బి.సరోజా దేవి, రేలంగి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు పౌరాణిక చలనచిత్రం. శివుడిగా రామారావు నటించిన అతికొద్ది సినిమాల్లో ఇది ఒకటి. సినిమా ఆర్థికంగా విఫలమైంది.
తారాగణం
[మార్చు]- ఎన్.టి.రామారావు
- బి.సరోజాదేవి
- ముక్కామల
- రేలంగి
- రమణారెడ్డి
- పద్మనాభం
- ధూళిపాళ
- అల్లు రామలింగయ్య
- వల్లూరి బాలకృష్ణ
- గిరిజ
- ఋష్యేంద్రమణి
- ఛాయాదేవి
- సూర్యకళ
- అన్నపూర్ణ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు, నిర్మాత: కె.వి.రెడ్డి
- మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, లీల, ఎస్.జానకి
స్పందన
[మార్చు]1968లో ఈ సినిమాతో పాటుగా, కె.వి.రెడ్డి స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన భాగ్యచక్రం సినిమా కూడా విడుదలై రెండూ పరాజయం పాలయ్యాయి. దాంతో కె.వి.రెడ్డి పరిస్థితి దిగజారిపోయింది. విజయ సంస్థ పక్కనపెట్టడంతో పాటుగా, ఇతర అవకాశాలు కూడా లేక మరో రెండేళ్ళపాటు ఆయన సినిమాలు చేయలేని స్థితి ఏర్పడింది.[1]
విశేషాలు
[మార్చు]- ఎన్.టి.రామారావు శివుని పాత్ర ధరించింది చాలా తక్కువ సినిమాల్లో. అలాంటి సినిమాల్లో ఉమా చండీ గౌరీ శంకరుల కథ కూడా ఒకటి.
పాటలు
[మార్చు]- ఆహా సఖి ఈ వనమే కనగా మనసాయె మనసాయె - పి.సుశీల బృందం
- అబ్బలాలో ఓయబ్బలాలో నీ అడుగుఅడుగన తళుక్ - ఘంటసాల
- ఏమిటో ఈ మాయా కలలోని కథవలెనాయె ఏమిటో - ఘంటసాల, పి.సుశీల
- ఓ సిగ్గులొలికే సింగారి పిల్లా ఎగ్గులేదే కంగారు పిల్లా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి
- కలగంటివా చెలి కలగంటివా కలలొన నీ ప్రియుని కనుగొంటివా - ఘంటసాల
- జయజయ శంకర ఉమా మహేశ్వరా చండీనాధా - మాధవపెద్ది సత్యం బృందం
- త ధిన్ ధోన ( ధిల్లానా) - ఘంటసాల, ఎస్. జానకి
- నన్నేల మరచినావో ఓ దేవదేవా నన్నేల మరచినావో - ఎస్. జానకి
- నన్ను వరించు వీరుడు నన్ను జయించు వీరుడు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
- నీ లీలలోనే ఒక హాయిలే నీ ప్రేమలాలనలోనే ఒక - సుశీల, ఘంటసాల
- సుందరేశ్వరా ఇందుశేఖరా కనువిందుగొన సేవలుగొని - ఎస్. జానకి
- శ్రీగౌరి నా పాపలై నన్ను దీవింప దయసేయనే - పి. లీల
- శ్రీకరంబై అపూర్వమై చెలగునెద్ది (పద్యం) - ఘంటసాల
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
---|---|
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య |
మూలాలు
[మార్చు]- ↑ ఎం.బి.ఎస్., ప్రసాద్. "రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 13 July 2015.