దొంగ రాముడు (1955 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగ రాముడు
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.రెడ్డి
కథ డి.మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
జమున,
కొంగర జగ్గయ్య,
ఆర్.నాగేశ్వరరావు,
రేలంగి,
సూర్యకాంతం,
మద్దాలి కృష్ణమూర్తి,
అల్లు రామలింగయ్య,
కంచి నరసింహారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం కృష్ణవేణి జిక్కి,
మల్లాది రామకృష్ణ శాస్త్రి,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం ఆది ఎమ్.ఇరానీ
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్
నిడివి 197 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దొంగరాముడు 1955 లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా అన్నపూర్ణ పిక్చర్స్ చే నిర్మించబడిన సినిమా.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

రాము (అక్కినేని), లక్ష్మి (జమున) అన్నాచెల్లెళ్ళు. చిన్నచిన్న అబద్ధాలు చెప్పి పెద్ద చిక్కుల్లో పడడం రాముకి చిన్నప్పుడే అలవాటయింది. చెల్లెలంటే ఎంతో ప్రేమ. దీపావళి పండుగరోజున చెల్లెలికి ఆనందం కలిగిస్తాడు. ఆ టపాకాయల చప్పుడుతో తల్లి షాక్ కు గురౌతుంది. తల్లి ఆరోగ్యం కోసం మందులు దొంగిలించిన నేరానికి పోలీసులు రామును అరెస్టు చేసి బాలనేరస్థుల జైలుకు పంపుతారు. తల్లి మరణించగా, చెల్లెలు లక్ష్మిని శరణాలయంలో చేర్పిస్తాడు టీచరు.

రాము పెద్దవాడై తిరిగి వచ్చి పరిస్థితి తెలుసుకుంటాడు. పిసినారి వీరభద్రయ్య (రేలంగి) కొడుకును రౌడీ బాబుల్ (ఆర్.నాగేశ్వరరావు) నుంచి రక్షించి, వారింట్లో నౌకరీ సంపాదిస్తాడు. అక్కడకు వచ్చిన కూరలు అమ్మే సీత (సావిత్రి)ను అల్లరి చేయబోయిన బాబుల్ ను పోరాటంలో ఓడిస్తాడు. చెల్లెలి జాడ తెలుసుకుని అక్కడకు అద్దె సూటులో వెళ్ళి తాను భాగ్యవంతున్నని గొప్పలు చెప్పి చెల్లెలుకి ఆర్ధికంగా సహకరిస్తానంటాడు. ఆమాట నిలుపుకోవడం కోసం వీరభద్రయ్య ఇంట్లో డబ్బుని దొంగిలిస్తాడు. తరువాత దొంగతనం బయటపడి రాము జైలుకు వెళతాడు.

శరణాలయం నుంచి బయటకు పంపబడ్డ లక్ష్మికి ఒక డాక్టర్ (జగ్గయ్య) ఆశ్రయం లభిస్తుంది. జైలునుంచి తిరిగివచ్చిన రాము విధివశాత్తూ ఆ డాక్టర్ వద్దే డ్రైవరుగా పనిచేస్తాడు. ఒకసారి ఆ ఇంట్లో వాచీ పోగా ఆ నేరం పాత నేరస్థుడయిన రాము చేశాడని తన్ని అవమానిస్తారు. ఇది చూసి లక్ష్మి బాధపడుతుంది. లక్ష్మికి డాక్టరుతో పళ్ళి నిశ్చయమవుతుంది. రాముడు మారువేషంలో పెళ్ళికి వెళతాడు. అదే సమయానికి బాబుల్ వీరభద్రయ్యను హత్య చేస్తాడు. ఆ నేరం కూడా రాము మీద పడుతుంది. సీత చాకచక్యంగా బాబుల్ చేత నిజం చెప్పించడంతో పోలీసులు బాబుల్ ని అరెస్టు చేసి రాముని విడుదల చేస్తారు. రాముడు, సీతల వివాహం చేసుకుంటారు.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా వినువీధినేలే రాజువే నిరుపేద చెలిపై మౌనమేనా సముద్రాల రాఘవాచార్య పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల
ఓ చిగురాకులలో చిలకమ్మా... చిన్నమాట వినరావమ్మా సముద్రాల రాఘవాచార్య పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల జిక్కి
చెరసాల పాలైనావా ఓ... సంబరాల రాంబాబు సముద్రాల రాఘవాచార్య పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ బోసి నవ్వుల బాపూజీ చిన్నీ పిలక బాపూజీ సముద్రాల రాఘవాచార్య పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల
రారోయి మా యింటికి మాటున్నది మంచి మాటున్నది

ఇతర విశేషాలు

[మార్చు]
  • "బాబుల్ గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి" అని ఆర్.నాగేశ్వరరావు మేనరిజమ్.

మూలాలు

[మార్చు]
  • ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య