కంచి నరసింహారావు
కంచి నరసింహారావు ఒక తెలుగు నటుడు. పలు నాటకాల్లో, సినిమాలలో నటించాడు. మాయా బజార్ చిత్రంలో కృష్ణుడి మారువేషంలో ఘటోత్కచుని ఆటపట్టించే పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందాడు.
నేపథ్యము
[మార్చు]1934 నుంచి సినిమాల్లో నటించాడు. 1935లో వచ్చిన హరిశ్చంద్రలో ఆయన కాలకౌశికుడిగా నటించారు. అలా అక్కడా అక్కడా నటిస్తూ వచ్చారేగాని, పెద్దగా పేరు రాలేదు. ఆయన రంగస్థలం మీద మంచి నటుడు. ఆయన రూపురేఖల దృష్ట్యా అలాంటి పాత్రలకే పిలిచేవారు. ఏవియమ్ తీసిన జీవితం (1950)లో మంచి పాత్రలో కనిపించారు. దొంగరాముడులో (1955) కనిపిస్తారు. అలా కనిపించే వేషాలతోనే తన జీవితాన్ని లాక్కొచ్చారు.
మాయాబజార్
[మార్చు]ఆయనది స్వచ్ఛమైన, స్పష్టమైన భాష. వేదం చదివే రీతిలో- 'మాయాబజార్'లో అటు నేనే ఇటు నేనే; చిన చేపను పెదచేప; చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ! అని ఆయన చెప్పిన సంభాషణల్ని ఇవాళ అందరూ చెబుతూ ఉంటారు. మాయా బజార్ చిత్రంలో ఘటోత్కచుడు ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు ఒక వృద్ధుడిగా మారువేషం వేసుకుని ఆటపట్టించడం సన్నివేశం. ఈ సినిమాను ఎన్నోసార్లు చూసినవాళ్లు కూడా, ఈ సన్నివేశంలో వృద్ధుడిగా నటించిన ఆ పాత్రధారి ఎవరు? అని అడుగుతూ ఉంటారు. ఆ ఒక్క దృశ్యంలో వచ్చినా, ఆ పాత్రకు అంతటి ప్రాధాన్యత, రాణింపూ వచ్చాయి. ఆయనే కంచి నరసింహారావు . నాటి నుంచి సినిమానే నమ్ముకుని, వచ్చిన ఏదో పాత్ర ధరిస్తూ కాలం గడిపారు. ఒక్క 'మాయాబజార్' పాత్రతో- మంచి పేరు తెచ్చుకుని చరిత్రలో నిలబడిపోయారు కంచి నరసింహారావు.
నటించిన సినిమాలు
[మార్చు]- మాయాబజార్ (1956) - శ్రీకృష్ణుడు మారువేషంలో
- మేలుకొలుపు (1956)
- దొంగరాముడు (1955) - మెడికల్ షాప్ ఓనర్
- కన్యాశుల్కం (1955) ముసలి పెళ్ళికొడుకు (పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రూపకంలో)
- రోజులు మారాయి (1955)
- చక్రపాణి (1954)
- దేవదాసు (1953)
- శాంతి (1952)
- జీవితం (1949)
- దక్షయజ్ఞం (1941)