హరిశ్చంద్ర (1935 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిశ్చంద్ర
(1935 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎ.రామన్
రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
తారాగణం కన్నాంబ,
భీమారావు,
అద్దంకి శ్రీరామమూర్తి,
పులిపాటి వెంకటేశ్వర్లు,
ఏలేశ్వరపు కుటంబశాస్త్రి
నిర్మాణ సంస్థ స్టార్ కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

హరిశ్చంద్ర టి.ఎ.రామన్ దర్శకత్వంలో స్టార్ కంబైన్స్ పతాకంపై కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి, భీమారావు ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చలన చిత్రం. ఈ సినిమాకు పి. పుల్లయ్య సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఈ సినిమాతో కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సినిమా మంచి విజయం సాధించింది.

సంగీతం[మార్చు]

హరిశ్చంద్ర సినిమాలోని దండాలండి బాబూ పాట, హరిశ్చంద్రుణ్ణి అమ్మే సన్నివేశం

చిత్ర బృందం[మార్చు]

నటీనటులు[మార్చు]

తర్వాతి కాలంలో ప్రఖ్యాతి పొందిన తెలుగు సినిమా నటులు కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తిలకు ఇది తొలి చలన చిత్రం.[1] నటులు - పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి:

సాంకేతిక వర్గం[మార్చు]

  • రచన - బలిజేపల్లి లక్ష్మీకాంతం
  • దర్శకత్వం - టి.ఎ.రామన్
  • ఫోటోగ్రఫీ - జినరాజా బోధ్యే
  • రికార్డింగ్ - జి.ఎల్.కాలే
  • సంగీతం - బి.జి.తెంబే, ఖా సాహెబ్ బూర్జిఖా
  • కళా దర్శకత్వం - గణపతిరావు వదాంగేకర్
  • సహ దర్శకుడు - అన్నాసాహెబ్ రాజోపాధ్యాయె
  • సహాయ దర్శకుడు - పి.పుల్లయ్య

స్పందన[మార్చు]

హరిశ్చంద్ర చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది విజయవంతం అయింది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 January 2007. Archived from the original on 10 జూన్ 2017. Retrieved 7 June 2017. Check date values in: |archive-date= (help)

బయటి లంకెలు[మార్చు]