Jump to content

ఏలేశ్వరపు కుటుంబశాస్త్రి

వికీపీడియా నుండి
ఏలేశ్వరపు కుటంబశాస్త్రి
జననం1898
తెనాలి, గుంటూరు జిల్లా
మరణం1942
వరంగల్
ఇతర పేర్లుఏలేశ్వరపు కుటంబశాస్త్రి
వృత్తిరంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు ప్రముఖ రంగస్థల, సినిమా నటులు.

ఏలేశ్వరపు కుటంబశాస్త్రి, ప్రముఖ రంగస్థల, సినిమా నటులు.

జననం

[మార్చు]

కుటంబశాస్త్రి 1898లో గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

1921లో రంగస్థల ప్రవేశం చేశారు. శ్రీ రామవిలాస సభలో నటుడిగా రాణించారు. ప్రతాపరుద్రీయం నాటకంలో ఈయన విద్యానాధుడుగా, బొబ్బిలియుద్ధం నాటకంలో రంగరాయుడు, శ్రీకృష్ణుని పాత్రలలో నటించారు.

నటించిన పాత్రలు

[మార్చు]
  • బొబ్బిలిలో రంగారాయుడు, ధర్మారాయుడు, బుస్సీ, హైదర్ జంగ్
  • సారంగధరుడులో సారంగధరుడు, రాజరాజు
  • శ్రీకృష్ణరాయభారంలో కృష్ణుడు, ధర్మరాజు, కర్ణుడు,
  • రోషనారలో శివాజీ, మోరోజీ, దావూద్
  • కన్యాశుల్కంలో పూటకూళ్లమ్మ, ఫోటోగ్రాపు బంట్రోతు, లుబ్ధావధానులు, సౌజన్యారావు
  • గయోపాఖ్యానంలో గయుడు, కృష్ణుడు

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

సినీరంగానికి వెళ్లి హరిశ్చంద్ర సినిమాలో కౌశికునిగా నటించారు.

మరణం

[మార్చు]

దాదాపు 30 నాటకాలలో 55 పాత్రలలో నటించి అందరి మన్నలను పొందిన కుటంబశాస్త్రి, 1942లో వరంగల్లో మరణించారు.

మూలాలు

[మార్చు]

ఏలేశ్వరపు కుటంబశాస్త్రి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 156.