ప్రభావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • 1. సూర్యుని భార్య అగు సంజ్ఞాదేవికి నామము.
  • 2. ఒకానొక స్త్రీ. ఈమె ఇంద్రుని పతిగా కోరి తపము ఆచరించుచు ఉండఁగా అతఁడు వసిష్ఠుని ఆకృతి తాల్చి కొన్ని బదరీఫలములను ఇచ్చి పక్వముచేయుము అనెను. అందులకు ఒప్పుకొని పక్వము చేయ ఆరంభింపఁగా అవి ఎంతసేపటికిని పక్వముకాక సేకరించిన కాష్ఠములు అన్ని సమసిపోయెను. అప్పుడు ఈమె, తాను కాష్ఠములను తేఁబోయిన అగ్ని ఆఱి దుష్పాకము అగును అని ఎంచి, తన కాలు ఇంధనముగా ఇడి పాకము చేయ పూనెను.అంత ఇంద్రుఁడు మెచ్చుకొని ఆమె కోరిన వరమును ఇచ్చెను. ఈమె తపము ఆచరించిన తీర్థము బదరీపాచనము అనఁబడును.
  • 3. వజ్రనాభుఁడు అను రాక్షసుని కూఁతురు. ప్రద్యుమ్నుని భార్య.


పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రభావతి&oldid=2182758" నుండి వెలికితీశారు