స్వరాజ్యలక్ష్మి
Appearance
స్వరాజ్యలక్ష్మి ప్రముఖ రంగస్థల, సినిమా నటి. ఈమె తాడంకి శేషమాంబ కుమార్తె.[1] ఈమె తెనాలిలో 1930 ఆగస్టు 15 న జన్మించింది.తల్లితోపాటు నటిగా తెలుగు సినిమారంగంలో కొంతకాలం పనిచేసిింది.
బాల్యం
[మార్చు]స్వరాజ్యలక్ష్మి తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వర రావు, నాగిరెడ్డి గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె పల్లెటూరి పిల్ల (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత పెద్ద మనుషులు (1954), దొంగరాముడు, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), చంద్రహారం మొదలైన సినిమాలలో నటించింది.
తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త సి.ఆర్.మోహన్ తో కలిసి కళారంగంలో కృషిచేసింది.2009 సెప్టెంబరు 4 న కన్నుమూశారు.
మూలాలు
[మార్చు]- ↑ నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 308.