Jump to content

రామచంద్ర కాశ్యప్

వికీపీడియా నుండి
రామచంద్ర కాశ్యప్
జననం
రామచంద్ర కాశ్యప్
వృత్తిన్యాయవాది
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రంగస్థల, సినిమా నటుడు

రామచంద్ర కాశ్యప్‌ సినిమా, రంగస్థల నటుడు. ఇతడు విజయవాడలో న్యాయవాదిగా పనిచేశాడు. అనుభవం గల రంగస్థల నటుడు. డి.వి.నరసరాజు రాసిన నాటకం నాటకంలో ముఖ్యపాత్రధారిగా మంచి గుర్తింపు పొందాడు. 'దేవదాసు' సినిమాకి ముందు వినోదావారు కొంతమంది కొత్తవారితో శాంతి (1952) తీశారు. రామచంద్ర కాశ్యప అందులో నాయక పాత్రను ధరించాడు. తర్వాత 'కోడరికం' (1953)లో నటించాడు. కె.వి.రెడ్డి గారి 'పెద్ద మనుషులు' (1954)లో కాశ్యప హీరో. తర్వాత 'ఆడబిడ్డ' (1955) లాంటి చిత్రాల్లో నాయకుడిగా నటించినా, ప్రాముఖ్యం లేని పాత్రలు ధరించడానికి ఇష్టపడేవాడు కాదు. మధ్య మధ్య విజయవాడ వెళుతూ సాంఘిక నాటకాల్లో, రేడియో నాటకాల్లో నటిస్తూ వచ్చాడు. తక్కువ చిత్రాల్లోనే నటించినా, 'పెద్ద మనుషులు' గుర్తున్నట్టు అందులోని కాశ్యప కూడా గుర్తిండి పోయాడు[1].

ఇతడు నటించిన సినిమాల జాబితా:

  1. శాంతి - 1952
  2. కోడరికం - 1953
  3. పెద్దమనుషులు -1954
  4. జ్యోతి - 1954
  5. ఆడబిడ్డ - 1955
  6. సదారమ -1956

మూలాలు

[మార్చు]
  1. డా.వందన శేషగిరిరావు. "Ramachandra Kashyap-రామచంద్ర కాశ్యప". Tollywood photo profiles. డా.వందన శేషగిరిరావు. Retrieved 21 January 2020.[permanent dead link]