పాపం పసివాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాపం పసివాడు
Papam pasivadu.jpg
దర్శకత్వంవి. రామచంద్రరావు
నిర్మాతఅట్లూరి శేషగిరిరావు
రచనగొల్లపూడి మారుతీరావు
స్క్రీన్ ప్లేగొల్లపూడి మారుతీరావు
నటులుఎస్వీ రంగారావు,
దేవిక,
నగేష్,
చిత్తూరు నాగయ్య,
త్యాగరాజు,
కైకాల సత్యనారాయణ,
రాజబాబు,
సూర్యకాంతం,
ఛాయాదేవి,
నాగశ్రీ,
ఎం.ప్రభాకరరెడ్డి
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
ఛాయాగ్రహణంఎమ్.కన్నప్ప
నిర్మాణ సంస్థ
విడుదల
సెప్టెంబరు 29, 1972 (1972-09-29)
భాషతెలుగు

పాపం పసివాడు వి. రామచంద్రరావు దర్శకత్వంలో 1972లో విడుదలైన చిత్రం. ఇందులో ఎస్. వి. రంగారావు, దేవిక, మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అట్లూరి శేషగిరిరావు శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు గొల్లపూడి మారుతీరావు అందించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం దర్శకత్వం వహించాడు. అమ్మా చూడాలీ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.[1]

విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధి వశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం దర్శకత్వం వహించాడు. అమ్మా చూడాలీ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.[2]

  • అమ్మ చూడాలీ నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ వొడిలో నిద్దుర పోవాలి - పి.సుశీల
  • మంచి అన్నదే కాన రాదు - పి.సుశీల
  • అయ్యో పసివాడా పాపం పసివాడా - (ఘంటసాల)
  • ఓ బాబూ నా బాబూ నీకన్న మాకు పెన్నిధి ఎవరు - పి. సుశీల

మూలాలు[మార్చు]

  1. "పసివాడి సాహసంతో సక్సెస్ మంత్రం - Nostalgia". iDreamPost.com (in ఆంగ్లం). Retrieved 2020-07-12.[permanent dead link]
  2. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.