Jump to content

అమ్మమాట

వికీపీడియా నుండి
అమ్మమాట
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి. రామచంద్రరావు
నిర్మాణం జి.వి.యస్.రాజు
తారాగణం సావిత్రి, శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ విజయలక్ష్మి మూవీస్
భాష తెలుగు

అమ్మమాట 1972 లో విడుదలైన తెలుగు సినిమా.[1] దీనికి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించగా, మహానటి సావిత్రి అమ్మగా నటించారు. ఈ సినిమాలో ఎంతబాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా అనే పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించగా; రమేష్ నాయుడు బాణీలను అందించగా, సావిత్రి, చిన్నారి శ్రీదేవి లపై చిత్రీకరించారు.[2]

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: వి.రామచంద్రరావు
  • సంగీతం:రమేష్ నాయుడు
  • గీత రచయితలు:దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
  • నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత, ఎస్.జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి
  • నిర్మాత: జి.వి.ఎస్.రాజు
  • నిర్మాణ సంస్థ: విజయలక్ష్మి మూవీస్
  • విడుదల:1972: ఫిబ్రవరి:25.

పాటలు

[మార్చు]
  1. ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా -గానం: పి.సుశీల బృందం; రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. ఎందుకమ్మా ఆపుతావు ఏమిటమ్మా నీ నమ్మకము - ఘంటసాల: రచన: ఆత్రేయ
  3. ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ ఈరోజు - పి.సుశీల - డా. సినారె
  4. ఎవరైనా చూశారా ఏమనుకుంటారు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత - డా. సినారె
  5. మాయదారి సిన్నోడి మనసే లాగేసిండు - ఎల్. ఆర్. ఈశ్వరి - డా. సినారె
  6. సద్దుమణగనీయవోయి చందురుడా ముద్దు - ఎస్. జానకి - డా. సినారె
  7. సా...రీ....సరిగదా పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమ్మమాట&oldid=4457492" నుండి వెలికితీశారు