నిలువు దోపిడి
నిలువు దోపిడి (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, దేవిక, కృష్ణ, జయలలిత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | మంజులా సినీ సిండికేట్ |
భాష | తెలుగు |
నిలువు దోపిడి మంజుల సినీ సిండికేట్ బ్యానర్‌పై యు.విశ్వేశ్వర రావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1968, జనవరి 25న విడుదలయ్యింది.
నటీనటులు
[మార్చు]- నందమూరి తారకరామారావు - రాము
- ఘట్టమనేని కృష్ణ - కృష్ణ
- దేవిక - జానకి
- జయలలిత - రాధ
- రేలంగి వెంకటరామయ్య
- సూర్యకాంతం - చుక్కమ్మ
- హేమలత - శేషమ్మ
- నాగభూషణం - భూషణం
- రాజబాబు - రాజు
- చిత్తూరు నాగయ్య -స్వామీజీ
- పద్మనాభం - లింగం
- రమాప్రభ
- ప్రభాకర్రెడ్డి
- ధూళిపాళ
- రాజనాల
- నెల్లూరు కాంతారావు
- కాంతారావు
- కొమ్మినేని శేషగిరిరావు
- ఎ.వి.సుబ్బారావు (జూనియర్)
- ఆరణి సత్యనారాయణ
- వల్లం నరసింహారావు
- మద్దాలి కృష్ణమూర్తి
- జగ్గారావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: సి.ఎస్.రావు
- నిర్మాత: యు.విశ్వేశ్వర రావు
- సంగీతం: కె.వి.మహదేవన్
- కథ: యు.విశ్వేశ్వర రావు
- మాటలు: త్రిపురనేని మహారథి
- పాటలు: దాశరథి కృష్ణమాచార్య, సి.నారాయణరెడ్డి, ఆత్రేయ, కొసరాజు రాఘవయ్యచౌదరి, ఆరుద్ర, యు.విశ్వేశ్వర రావు, శ్రీశ్రీ
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- కళ:ఎస్.కృష్ణారావు
- బుర్రకథ: నాజర్ దళం
- నృత్యాలు: తంగప్ప
చిత్రకథ
[మార్చు]రంగవరం జమీందారు చనిపోతూ తన కుమారులు రాము, కృష్ణలను తన తోబుట్టువులైన చుక్కమ్మ, శేషమ్మలకు అప్పజెపుతాడు. చుక్కమ్మకు జమీందారీ ఆస్తిని చూసి కన్నుకుట్టి శేషమ్మతో కలిసి కుట్రపన్ని తమ్ముడు నాగభూషణం సహాయంతో మేనల్లులను హతమార్చబోతుంది. రైల్లో హంతకుడి చేతుల్లో పడిన పిల్లలను ఒక ముసుగు మనిషి రక్షించి ఒక గురుకులంలో చేరుస్తాడు. అక్కడే పెద్దవారైన అన్నదమ్ములు గురువుద్వారా నిజవృత్తాంతం తెలుసుకుని రంగవరం చేరుకుంటారు. ఈ లోగానే చుక్కమ్మ కూతురు రాధను కృష్ణ, శేషమ్మ కూతురు జానకిని రాము పట్టణంలో ప్రేమించడం జరుగుతుంది.
రంగవరం వచ్చిన రాము, కృష్ణలు కోయ వేషాలు వేస్తారు. చుక్కమ్మను తమ మాటలు వినేటట్లు చేస్తారు. ఆ తర్వాత రాము రౌడీ వేషం వేస్తాడు. చుక్కమ్మకు నమ్మినబంటుగా తయారవుతాడు. చుక్కమ్మకు, ఆమె సహాయంతో సమితి ప్రెసిడెంటు అయిన భూషణానికి లంకె బిందెల ఆశ పుట్టిస్తాడు. భూషణం తన కొడుకు రాజుకు రాధను చేసుకుని ఆస్తి అపహరించాలనుకుంటాడు. తోబుట్టువుకే ఎసరు పెట్టబోతాడు. కాని రాము, కృష్ణలు అడ్డుపడటంతో అసలు రహస్యం బయటపడుతుంది[1].
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ సమకూర్చాడు.[2]
క్ర.సం. | పాట | పాడినవారు | గీత రచయిత |
---|---|---|---|
1 | లోకం ఇది లోకం | పి.సుశీల | దాశరథి |
2 | ఆడపిల్లలంటే హోయ్ హోయ్ | పి.సుశీల | సి.నా.రె. |
3 | చుక్కమ్మ అత్తయ్యరో బుల్ బుల్ బుల్ | ఘంటసాల | యు.విశ్వేశ్వర రావు |
4 | నీ బండారం పైన పటారం | ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం | ఆరుద్ర |
5 | నేనే ధనలక్ష్మిని | ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, ఘంటసాల, పిఠాపురం | శ్రీశ్రీ |
6 | జీవులెనుబది నాలుగు లక్షల చావుపుట్టుకలిక్కడ | మాధవపెద్ది | కొసరాజు |
7 | అయ్యింది అయ్యింది అనుకున్నది | పి.సుశీల, ఘంటసాల | ఆత్రేయ |
8 | అయ్యలారా ఓ అమ్మలారా | వల్లం నరసింహారావు, నాజర్ | కొసరాజు |
మూలాలు
[మార్చు]- ↑ వి.ఆర్. (2 February 1968). "చిత్రసమీక్ష:నిలువు దోపిడి". ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original on 3 జూలై 2020. Retrieved 3 July 2020.
- ↑ వెబ్ మాస్టర్. "NILUVU DOPIDI (1968) SONGS". MovieGQ. Retrieved 3 July 2020.
బయటిలింకులు
[మార్చు]- 1968 తెలుగు సినిమాలు
- ఎన్టీఆర్ సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- రేలంగి నటించిన సినిమాలు
- సూర్యకాంతం నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- కాంతారావు నటించిన సినిమాలు
- కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు
- రాజనాల నటించిన సినిమాలు
- ధూళిపాళ నటించిన సినిమాలు
- నాగయ్య నటించిన సినిమాలు
- నాగభూషణం నటించిన సినిమాలు
- దేవిక నటించిన సినిమాలు
- జయలలిత నటించిన సినిమాలు