సర్వర్ సుందరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్వర్ సుందరం
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణన్ - పంజు
నిర్మాణం నెల్లూరు కాంతారావు పహిల్వాన్
కథ కె.బాలాచందర్
తారాగణం నగేష్,
కె.ఆర్.విజయ,
ముత్తురామన్
సంగీతం విశ్వనాథన్ - రామమూర్తి
పామర్తి
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
ఛాయాగ్రహణం ఎం.మారుతీరావు
కూర్పు ఎన్.ఎస్.ప్రకాశం
నిర్మాణ సంస్థ టైగర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


సర్వర్ సుందరం (Server Sundaram) ఒక 1966 జులై 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనికి మాతృక ఇదే పేరుతో నున్న తమిళ సినిమా సర్వర్ సుందరం. దీని కథను దర్శకుడు కె.బాలచందర్ అందించారు. తెలుగులో ఈ చిత్ర దర్శకుడు కృష్ణన్ - పంజు.

దీనిని మై సుందర్ హూ పేరుతో మహమూద్ హీరోగా 1971 సంవత్సరం హిందీలో నిర్మించారు.[2]

కథాంశం

[మార్చు]

సుందరం (నగేష్) ఒక హోటల్ లో సర్వర్ గా పనిచేస్తుంటాడు. ఇతడు తన తల్లితో హాయిగా జీవిస్తుంటాడు. అదే హోటల్ కు రాధ (విజయ) ఎక్కువగా వస్తుంటుంది. సుందరం రాధను ప్రేమిస్తుంటాడు. అయితే రాధ మాత్రం ఏ మాత్రం ఇష్టపడదు. ఆమెను ఆకర్షించడానికి రాఘవన్ (ముత్తురామన్) సహాయంతో సినిమాలలో ప్రవేశిస్తాడు. సినిమా అంతా చివరికి ఏ విధంగా అతడు రాధ ప్రేమను సంపాదిస్తాడని చూపిస్తుంది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. కసి కసిలే ఒక కన్నె పడుచై ఇలలోనే దివి వెలియించే - పి.సుశీల బృందం - రచన: అనిసెట్టి
  2. నవయువతి చక్కని ప్రియ నవ యువతి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అనిసెట్టి
  3. పర బ్రహ్మ పరమేశ్వర...పాడిపంటలు ,మాధవపెద్ది, సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి బృందం, రచన:అనిశెట్టి
  4. పూత పూచే హృదయం ఇది, పి.బి.శ్రీనివాస్, పి సుశీల , రచన:అనిశెట్టి
  5. కన్నె డెందం మోహలందే కరుగదా, పి.సుశీల, రచన: అనిశెట్టి
  6. మోహిని ఇలపై వేలసేనే ఎమ్మా , పి.సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: అనిశెట్టి

అవార్డులు

[మార్చు]

తమిళ సర్వర్ సుందరం సినిమాకు ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం, పిలింఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నది.[3]

వెలుపలి లింకులు

[మార్చు]

சர்வர் சுந்தரம் సర్వర్ సుందరం

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 19.
  2. ఐ.ఎమ్.బి.డి.లో మై సుందర్ హూ పేజీ
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-05-04. Retrieved 2011-09-27.