అనిసెట్టి సుబ్బారావు

వికీపీడియా నుండి
(అనిసెట్టి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అనిసెట్టి సుబ్బారావు
జననంఅక్టోబరు 23, 1922[1]
మరణం1979
వృత్తితెలుగు సినిమా రచయిత మరియు ప్రగతిశీల కవి, నాటక కర్త.
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు

అనిసెట్టి సుబ్బారావు (1922-1981), స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా రచయిత మరియు ప్రగతిశీల కవి, నాటక కర్త.

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించాడు. ఈయన రచనలలో అగ్నివీణ (1949), బిచ్చగాళ్ల పదాలు ముఖమైనవి. ఈయన నాటకాల్లో రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), గాలిమేడలు[2] (డిసెంబరు 1949), శాంతి[3] (1951), మా ఊరు (1954) చెప్పుకోదగినవి. సుబ్బారావు కొన్నాళ్ళు ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికలకు సంపాదకునిగా పనిచేశాడు. 1942లో మరియు 1944లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు. కమ్యూనిజం వైపు ఆకర్షితుడై తన నాటకాల ద్వారా ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు.

సినీరంగ ప్రస్థానం[మార్చు]

1955లో రచయితగా తెలుగు సినీరంగంలో అడుగుపెట్టాడు. సుబ్బారావు, మహాకవి శ్రీశ్రీకి బాగా సన్నిహితుడు. సుబ్బారావు మరణించిన తర్వాత మద్రాసులోని సంతాప సభలో శ్రీశ్రీ 'నాకు అనిశెట్టి, ఆరుద్ర అ-ఆ’ లాంటివారు. అ-పోయింది. ఆ- మిగిలింది’ అని చెప్పి క్లుప్తంగా తమ అనుబంధాన్ని తెలిపి ముగించాడు.[4]

అనిసెట్టి పుట్టింది ఆగర్భ శ్రీమంతుల ఇంట్లోనే గాని అతడు తన చుట్టూ వున్న ఆగర్భ దరిద్రుల ఆర్తనాదాలనే విన్నాడు. తండ్రి కోటి లింగం కోటికి పడగెత్తగల శ్రీమంతులు. నరసరావుపేటలోనూ, చిలకలూరిపేటలోనూ ఆయిల్‌ మిల్లులు, ఇరవై లారీలు ఉండేవి. తండ్రికి మిల్లులోని పనివాళ్ళు ఒకసారి సమ్మె చేస్తే అనిసెట్టి ఆ కార్మికుల పక్షమే వహించి తండ్రికి కోపం తెప్పించాడు. 1941 నాటికి గుంటూరు హిందూ కళాశాలలో బి.ఎ. పట్టా పుచ్చుకొన్న అనిసెట్టిని అతని తండ్రి 'లా' చదవడానికి మద్రాసు పంపించాడు.[5]

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (16 October 2017). "సంచలనం సృష్టించిన గాలిమేడలు". lit.andhrajyothy.com. కందిమళ్ల సాంబశివరావు. మూలం నుండి 26 October 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 22 October 2019.
  2. సంచలనం సృష్టించిన గాలిమేడలు, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 16 అక్టోబరు 2017, పుట.10
  3. తొలి తెలుగు మూక నాటిక 'శాంతి', (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 28 ఆగస్టు 2017, పుట.14
  4. శ్రీశ్రీతో ఓ జ్ఞాపకం - జయంపు కృష్ణ
  5. అనుకంపన కవి అనిసెట్టి సుబ్బారావు - ప్రజాశక్తి 27 Nov 2011

యితర లింకులు[మార్చు]