దైవబలం
స్వరూపం
'దైవబలం' తెలుగు చలన చిత్రం 1959 సెప్టెంబర్,17 న విడుదల.పొన్నలూరు బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయశ్రీ జంటగా నటించారు. పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గుడిమెట్ల అశ్వద్ధామ సంగీతం అందించారు.
| దైవబలం (1959 తెలుగు సినిమా) | |
దైవబలం సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | పొన్నలూరి వసంతకుమారరెడ్డి |
| నిర్మాణం | పొన్నలూరి వసంతకుమారరెడ్డి |
| తారాగణం | నందమూరి తారక రామారావు, జయశ్రీ, రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి వెంకటేశ్వరరావు |
| సంగీతం | అశ్వత్థామ |
| నిర్మాణ సంస్థ | పొన్నలూరి బ్రదర్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు _ చంద్రసేనుడు
- జయశ్రీ_రూప
- శోభన్ బాబు
- గుమ్మడి వెంకటేశ్వరరావు_ ఉగ్రసేన
- రేలంగి వెంకట్రామయ్య_ టక్కు
- తిక్కవరపు రమణారెడ్డి_తామరం
- ముక్కామల కృష్ణమూర్తి_ కనకాక్షి
- వంగర వెంకటసుబ్బయ్య_ జోతిష్యం జగన్నాథ పండితులు
- కస్తూరి శివరావు_ మాధవ
- గిరిజ_ చంప
- మాలతి_అన్నపూర్ణ
- మోహన_ గంధర్వ రాణి .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి
- చిత్రానువాదం: పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి
- కథ: పొన్నలూరు బ్రదర్స్
- సంగీతం: గుడిమెట్ల అశ్వద్ధామ
- గీత రచయితలు:సముద్రాల రాఘవాచార్య, అనిశెట్టి సుబ్బారావు,కొసరాజు రాఘవయ్య చౌదరి, పరశురామ్
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, కె.రాణి,వైదేహి,శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్
- ఛాయా గ్రహణం: బి.జె.రెడ్డి
- ఎడిటింగ్: రాజన్
- నిర్మాణ సంస్థ: పొన్నలూరు బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్
- విడుదల:17:09:1959.
పాటలు
[మార్చు]- అందాల ఓ చందమామ రావోయి నీ కొంటె కొంటె నవ్వుల వలపించ రావోయి - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్_ రచన: అనిశెట్టి సుబ్బారావు
- అందాల ఓ చందమామ రావోయి ఈ దీనురాలి జాలి గాథ ఆలకించవోయి - ఎస్.జానకి_ రచన: అనిశెట్టి సుబ్బారావు
- ...ప్రహ్లాదు మొరవిని ఏలినావు (పద్యం) - (గాయని ?)
- కొడితే కొస్తాలే కొట్టాలి ఒరే చిచ్చుల పిడుగా పడితే బస్తీలే పట్టాలి - పిఠాపురం, మాధవపెద్ది_ రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
- చిరు చిరు నవ్వుల పువ్వుల మురిసే మరుని కటారి వయ్యారి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి_ రచన: అనిశెట్టి సుబ్బారావు
- జీవితం ఎంతో హాయీ ఈ యవ్వనమే కనవిందోయి పగలంతా - గాయని , వైదేహి _రచన: అనిశెట్టి సుబ్బారావు
- ఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ పట్టినావు - కె. రాణి బృందం_ రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
- నిను వరియించి మది కరిగించి కౌగిట చేర్చెదలే నా జీవనజ్యోతివిలే - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి_ రచన:అనిశెట్టి సుబ్బారావు
- పతికి కలిగిన దుర్గతి మది తలంచి (పద్యం) - (గాయని ?)
- మేటి హాలాహలంబును మ్రింగవచ్చు ప్రళయకాలగ్నిలోబడి (పద్యం) - ఘంటసాల
- రావమ్మ కాళీ రావే మహంకాళీ వచ్చి మమ్ము రక్షించు - కె. రాణి బృందం_ రచన: పరశురామ్
- లేనేలేదా రానేరాదా బాబును చూసే భాగ్యము మా బాబును చూసే - గాయని .వైదేహి _రచన:సముద్రాల రాఘవాచార్య
- ఓం నమో భగవతే_పి.బి.శ్రీనివాస్_ రచన: పరశురామ్
- నందకిషోర్_ రచన: పరశురామ్
- ఆనందం వరించే_ పి బి.శ్రీనివాస్, ఎస్.జానకి_రచన:అనిశెట్టి.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)