అమ్మాజీ (సినిమా నటి)
స్వరూపం
అమ్మాజీ | |
---|---|
జననం | తాళాబత్తుల అమ్మాజీ |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | జయశ్రీ |
క్రియాశీల సంవత్సరాలు | 1951-1963 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా నటి |
గుర్తించదగిన సేవలు | పెంకిపిల్ల దైవబలం |
జీవిత భాగస్వామి | మహేంద్ర |
పిల్లలు | జయచిత్ర |
అమ్మాజీ పాతతరం సినిమా నటి. ఈమె దైవబలం చిత్రం వరకు అమ్మాజీగా ఆ తర్వాత జయశ్రీ అనే పేరుతో చెలామణీ అయ్యింది. ఈమె కూతురు జయచిత్ర కూడా ప్రముఖనటి.
విశేషాలు
[మార్చు]కాకినాడకు చెందిన అమ్మాజీ సాంప్రదాయక నృత్యాన్ని అభ్యసించింది. కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ క్లబ్ తరఫున నాటకాలలో నటించింది. ఈమెను అందరూ చిన్న అంజలీదేవి అని ముద్దుగా పిలిచేవారు. ఈమె నిర్మాతల దృష్టిలో పడి చలనచిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ఈమె మహేంద్ర అనే పశువైద్యుని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. వారిలో జయచిత్ర సినీతారగా రాణించింది.
ఈమె నటించిన సినిమాలు:
- పెంకిపిల్ల (1951)
- అన్నదాత (1954)
- రాజు-పేద (1954)
- రోజులు మారాయి (1955)
- పాండురంగ మహత్యం (1957)
- శ్రీకృష్ణ మాయ (1958)
- దైవబలం (1959)
- సతీ సుకన్య (1959)
- టైగర్ రాముడు (1962)
- దేవసుందరి (1963)
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమ్మాజీ పేజీ