సీత (1961 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీత
(1961 తెలుగు సినిమా)
Seetha1961film.jpg
దర్శకత్వం యం.కుంచాకొ
నిర్మాణం కె.జె.మోహన్
కథ ఉత్తర రామాయణం ఆధారంగా
తారాగణం ప్రేమ్‌ నజీర్,
కుచలకుమారి,
తిక్కురిసి
సంగీతం ఎం.రంగారావు
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
నిర్మాణ సంస్థ ఉదయా స్టూడియోస్
విడుదల తేదీ మార్చి 11, 1961
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సీత 1961, మార్చి 11న విడుదలైన తెలుగు సినిమా. ఈ పౌరాణిక సినిమా అదే పేరుతో 1960లో విడుదలైన మలయాళ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఉత్తర రామాయణ కథను ఆలంబనగా చేసుకుని విజయ్ భట్ 1947లో నిర్మించిన హిందీ సినిమా రామ్‌ రాజ్య ఈ చిత్రానికి ఆధారం.

నటీనటులు[మార్చు]

 • ప్రేమ్‌ నజీర్ - శ్రీరాముడు
 • కుచలకుమారి - సీత
 • తిక్కురిసి సుకుమారన్ నాయర్ - వాల్మీకి
 • హరి - లవుడు
 • టి.ఆర్.ఓమన - మాలిని
 • ఎన్.రాజన్ నాయర్- లక్ష్మణుడు
 • జె.శశికుమార్ - వశిష్టుడు
 • కాంచన - కౌసల్య
 • ఎస్.పి.పిళ్లై

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకుడు: యం.కుచాంకొ
 • మాటలు, పాటలు: అనిసెట్టి సుబ్బారావు
 • సంగీతం: ఎం.రంగారావు
 • నిర్మాణ సంస్థ: ఉదయా స్టూడియోస్

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటల వివరాలు[1]:

క్ర.సం. పాట పాడినవారు
1 అందమోహో అందమోహో.. అహ అందరి డెందాల మైమరపించే జె.వి.రాఘవులు,
జిక్కి బృందం
2 వీణా హాయిగా పాడుదమా వేదన రగుల మానవ హృదియే పి.సుశీల
3 లాలి లాలి లాలీ పాలబుగ్గల సోయగమ్మే జాబిలిని పి.సుశీల
4 రామ రామ పాహిమాం ముకుంద రామ పాహిమాం మాధవపెద్ది
5 అద్భుతం ఇలను దశావతారమ్ములే కనిపించెనే మాధవపెద్ది
6 రామ రాజ్యంలోని వైభవాలు హాయిగ ప్రజలంతా పాడరండి కె.అప్పారావు బృందం
7 దేవీగనవే స్వర్గసుఖం రామ హృదయం వలచే చంద్ర ముఖం పి.లీల
8 నడువమ్మాయి టకా టకా నా కాళ్లే వణికేను కటా కటా కె.అప్పారావు,
కె.రాణి
9 మంగళమనరే సీతా దేవికి మంగళ మనరమ్మా సీమంత వేళలో ఎస్.జానకి బృందం
10 ప్రజలెవరో రాజును నేనైతే కె.రాణి,
జిక్కి,
కె.అప్పారావు,
జె.వి.రాఘవులు బృందం
11 ప్రాప్తరాజ్యస్య రామస్య రాక్షసానామ్ వధేకృతే (శ్లోకం) మాధవపెద్ది
12 పావనమూర్తి సీతామాతా కథ పాడెదమండి ఎ.ఎం.రాజా,
పి.బి.శ్రీనివాస్
13 పావనమూర్తీ గాదనే ఎద పరవశ మొందగ వినిపిస్తాము ఎ.ఎం.రాజా,
పి.బి.శ్రీనివాస్
 1. కొల్లూరు భాస్కరరావు. "సీత (లవ - కుశ) - 1961 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 2 April 2020.