మారెళ్ళ రంగారావు
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మారెళ్ళ రంగారావు | |
---|---|
వృత్తి | సంగీత దర్శకుడు |
మారెళ్ళ రంగారావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఇతడు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. చిత్రపు నారాయణమూర్తి, డి.యోగానంద్, తాతినేని ప్రకాశరావు, ఎ.భీంసింగ్, వి. రామచంద్రరావు, ఎ.సి.త్రిలోకచందర్, బి.ఎస్.రంగా, కృష్ణన్ - పంజు, జి.విశ్వనాథం, టి.ఆర్.రామన్న, సి.వి.శ్రీధర్ మొదలైన దర్శకుల సినిమాలకు ఇతడు సంగీతాన్ని సమకూర్చాడు. ఇతని స్వరకల్పనలో ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం, మాధవపెద్ది, పి.లీల, జిక్కి, కె.జమునారాణి, పి.సుశీల, కె.రాణి, రావు బాలసరస్వతీ దేవి, ఎ.పి.కోమల, ఎల్.ఆర్.ఈశ్వరి మొదలైన గాయినీ గాయకులు పాడారు. ఇతడు 1955-1990ల మధ్యకాలంలో చలనచిత్ర రంగంలో పనిచేశాడు. సుమారు 40 చిత్రాలకు సంగీత సారథ్యం వహించాడు. [1]
చిత్రాల జాబితా
[మార్చు]ఇతడు సంగీత దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు[1]:
- పసుపు కుంకుమ (1955)
- వేగుచుక్క (1957) (ఎస్.వేదాచలంతో కలిసి)
- నాగమోహిని (1959)
- పెద్ద కోడలు (1959)
- కన్నకూతురు (1960)
- శ్రీకృష్ణపాండవయుద్ధం (1960)
- చిన్నన్న శపథం (1961)
- సీత (1961)
- ఆదర్శ వీరులు (1962)
- త్యాగమూర్తులు (1963) (కె.వి.మహదేవన్ తో కలిసి)
- నిరపరాధి (1963)
- రాణీ సంయుక్త (1963)
- అద్దాలమేడ (1964)
- నవరత్న ఖడ్గ రహస్యం (1964)
- వనసుందరి (1964)
- భక్త కనకదాసు (1965)
- సింద్బాద్ ఆలీబాబా, అల్లావుద్దీన్ (1965) (రవితో కలిసి)
- నాగజ్యోతి (1966)
- ధాన్యమే ధనలక్ష్మి (1967)
- పగబట్టిన పడుచు (1971)
- తిరుగుబాటు వీరుడు (1974) (ఎం. ఎస్. విశ్వనాథన్ తో కలిసి)
- బాగ్దాద్ వీరుడు (1975) (ఎం. ఎస్. విశ్వనాథన్తో కలిసి)
- కాశ్మీరు బుల్లోడు (1976) (శంకర్ గణేష్ తో కలిసి)
- హీరో - 76 (1976) (ఎం. ఎస్. విశ్వనాథన్తో కలిసి)
- రాగాలు అనురాగాలు (1977) (కె.వి.మహదేవన్ తో కలిసి)
- పిడుగులాంటి పిల్ల (1979)
- శ్రీ రాఘవేంద్ర మహిమ (లేక) మంత్రాలయ మహత్యం (1979)
- ధర్మం దారి తప్పితే (1980)
- దేవీ రాజరాజేశ్వరి (1981)
- శనీశ్వర మహిమ (1981)
- షిరిడి సాయిబాబా (1981)
- బ్లాక్ మెయిల్ (1985)
- ఓ ప్రేమ కథ (1987)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 వెబ్ మాస్టర్. "Marella_Rangarao". indiancine.ma. Retrieved 26 January 2022.