Jump to content

అద్దాలమేడ (1964 సినిమా)

వికీపీడియా నుండి

అద్దాలమేడ 1964 ఫిబ్రవరి 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1962లో విడుదలైన కన్నడి మాలిగై అనే సినిమా దీనికి మాతృక.

అద్దాలమేడ
(1964 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం స్వామి మహేష్
నిర్మాణం సి.వి.గోపాల్
తారాగణం చిత్తూరు నాగయ్య,
ఎం. ఆర్. రాధ,
టి. ఆర్. రాధారాణి,
టి. ఆర్.సరోజ,
అశోకన్
సంగీతం మారెళ్ళ రంగారావు
నేపథ్య గానం ఎస్.జానకి,
వైదేహి,
కె.రాణి,
రామచంద్రరావు
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ బాలమురుగన్ పిక్చర్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: స్వామి
  • మాటలు, పాటలు: శ్రీశ్రీ
  • సంగీతం: మారెళ్ళ రంగారావు
  • ఛాయాగ్రహణం: ఆర్.చిట్టిబాబు
  • నృత్యాలు: జయరామన్
  • స్టంట్: వరదరాజన్
  • కూర్పు: మాణిక్యం
  • నిర్మాత: సి.వి.గోపాల్
  • దర్శకత్వం: స్వామి - మహశ్

నటీనటులు

[మార్చు]
  • చిత్తూరు నాగయ్య
  • ఎం.ఆర్.రాధా
  • ఎస్.ఎ.అశోకన్
  • ఎ.కె.మోహన్
  • పి.డి.సంబంధం
  • టి.ఆర్.రాధారాణి
  • టి.ఆర్.సరోజ
  • ఎస్.డి.సుబ్బలక్ష్మి
  • శాంతి
  • సుకుమారి
  • టి.కె.సంపంగి
  • లీల

ఎస్టేట్ జమీందార్ కరుణాకరం పిల్లలు లేని లోటుతో ఆ ఊరికంతా తానే పెద్దయి గౌరవంగా పెరుగుతుంటాడు. రత్నం అతని ఎస్టేటులో మేనేజర్‌గా నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. కానీ అతని స్నేహితుడు డాక్టర్ మనోహర్ సహవాసంవల్ల అతనికి త్రాగుడు, జూదం, వ్యభిచారం మొదలైన చెడు అలవాట్లన్నీ అబ్బుతాయి. ఒకసారి రత్నం ముసుగు మనిషి బారి నుండి రాణి అనే అమ్మాయిని కాపాడుతాడు. వారిద్దరూ ప్రేమించుకుంటారు. రాణి రత్నం వల్ల గర్భవతి అయ్యింది.

పాటలు

[మార్చు]
  1. అందరి కందని యవ్వనమిదియే కన్నారా అంప వాన సూనశరుడే కురిసెసుమా - రామం
  2. చెలియ ముఖం వెలుగు ఫలం పండే కలసి సేవచేయు పడతులకు సిరి సుఖాలు నిండే - కె.రాణి బృందం
  3. జాలం ఏలో ఈ వేళలనే బంతులాడి తూలు పూదోపలనే - ఎస్.జానకి, రామచంద్రరావు
  4. మారు మాట చెప్పజాలనే బాల మల్లడియైనవి వెల్లువగా ఆశలే - వైదేహి
  5. మోడైన జీవితమే పూచిన ఓ పూలమాలా నేడాయె మా హృదయం ఆపదకే చుట్టముగా - ఎస్.జానకి
  6. రాశి చుడవచ్చు అద్దాన మొగం జాడ తెలుపగా మక్కువ తీపి

మూలాలు

[మార్చు]