Jump to content

కృష్ణన్ - పంజు

వికీపీడియా నుండి
కృష్ణన్ - పంజు
కృష్ణన్ (ఎడమ) పంజు (కుడి)
జననంఆర్.కృష్ణన్:
(1909-07-18)1909 జూలై 18
ఎస్.పంజు:
(1915-01-24)1915 జనవరి 24
ఆర్.కృష్ణన్:
చెన్నై, తమిళనాడు
ఎస్.పంజు:
ఉమయాల్‌పురమ్, కుంభకోణం, తమిళనాడు
మరణంఆర్.కృష్ణన్:
1997 జూలై 17(1997-07-17) (వయసు 87)
ఎస్.పంజు:
1984 ఏప్రిల్ 6(1984-04-06) (వయసు 69)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసినిమా దర్శకులు
క్రియాశీల సంవత్సరాలుఆర్.కృష్ణన్:
1944–1997
ఎస్.పంజు:
1944–1984

ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ - పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆర్.కృష్ణన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో 1909, జూలై 18న జన్మించాడు.[2] మొదట్లో ఇతడు కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియో (అప్పట్లో కందన్ స్టూడియోగా పిలువబడేది) లో లాబొరేటరీ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు.[3] ఇతని కుమారుడు కె.సుభాష్ కూడా చలనచిత్ర దర్శకుడుగా పనిచేశాడు.[4]

ఎస్.పంజు అసలు పేరు పంచాపకేశన్. ఇతడు కుంభకోణం సమీపంలోణి ఉమయాల్ పురంలో 1915, జనవరి 24న జన్మించాడు.[2] ఇతడు దర్శకుడిగా మారడానికి పూర్వం పి.కె.రాజాశాండో వద్ద సహాయ ఎడిటర్‌గా, ఎల్లిస్ ఆర్. దంగన్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఇతడు పంజాబి పేరుతో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[3][5][6]

వృత్తి

[మార్చు]

వీరిరువురూ కందన్ స్టూడియోలో పి.కె.రాజా శాండో దర్శకత్వం వహించిన మనునీధి చోళన్ (1942) అనే తమిళ సినిమాలో పనిచేశారు.[5] ఆ సమయంలో వీరిరువురూ మంచి మిత్రులుగా మారారు. వీరి పనితనాన్ని గమనించి రాజాశాండో తన తరువాతి ప్రాజెక్టు పూంపావై వీరికి ఆప్పజెప్పాడు. ఆ విధంగా పూంపావై (1944) దర్శకులుగా ఈ జంట మొదటి చిత్రం అయ్యింది.[7] 1947లో ఈ జంట పైతియక్కరన్ అనే సినిమాకు దర్శకులుగా పనిచేశారు.[8] 1949లో వీరు మిష్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేరణతో నల్లతంబి అనే సినిమాను తీశారు. ఆ సినిమాకు సి.ఎన్.అన్నాదురై స్క్రిప్ట్ వ్రాశాడు. ఇది అతని మొదటి సినిమా. తరువాతి కాలంలో ఇతడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[9] 1952లో వీరు దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు తమిళనాడుకు మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి సంభాషణలు వ్రాశాడు.[10][11] వీరు భాభీ, షాదీ వంటి హిందీ సినిమాలు కుడా దర్శకత్వం వహించారు. వీరికి 1960లో కలైమామణి పురస్కారం లభించింది.[1]

మరణాలు

[మార్చు]

1984, ఏప్రిల్ 6వ తేదీన ఎస్.పంజు చెన్నైలో మరణించాడు.[8] పంజు మరణం తర్వాత కృష్ణన్ ఏ సినిమాను తీయలేదు. అతడు 1997, జూలై 15వ తేదీన మరణించాడు.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాష బ్యానర్ మూలం
1944 పూంపావై తమిళ లియో పిక్చర్స్
1947 పైతియక్కరన్ తమిళ ఎన్.ఎస్.కె.పిక్చర్స్
1949 నల్లతంబి తమిళ ఎన్.ఎస్.కె.ఫిలింస్ & ఉమా పిక్చర్స్
1949 రత్త్నకుమార్ తమిళ మురుగన్ టాకీస్
1952 పరాశక్తి తమిళ నేషనల్ పిక్చర్స్
1953 కణగల్ తమిళ మోషన్ పిక్చర్స్ టీమ్
1954 రక్త కన్నీర్ తమిళ నేషనల్ పిక్చర్స్
1955 శాంతసక్కు కన్నడ శ్రీ పాండురంగ ప్రొడక్షన్స్
1956 కులదైవమ్ తమిళ ఎస్.కె.పిక్చర్స్
1957 పుదైయల్ తమిళ కమల్ బ్రదర్స్
1957 భాభీ హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1958 మామియర్ మెచ్చిన మారుమగళ్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1959 బర్ఖా హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1960 తిలకమ్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1960 దైవపిరవి తమిళ కమల్ బ్రదర్స్
1960 బిందియా హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1961 సుహాగ్ సిందూర్ హిందీ
1962 షాదీ హిందీ
1962 మన్-మౌజి హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1962 అన్నై తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1963 కుంకుమమ్ తమిళ రాజమణి పిక్చర్స్
1964 వళ్కై వళ్వతర్కె తమిళ కమల్ బ్రదర్స్
1964 సర్వర్ సుందరం తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1964 మేరే కసూర్ క్యా హై హిందీ
1965 కుళందయం దైవమమ్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1966 పెట్రల్తాన్ పిళ్ళైయ తమిళ ఎమ్జీయార్ పిక్చర్స్
1966 లేత మనసులు తెలుగు ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1966 లాడ్‌లా హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1968 దో కలియాఁ హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1968 వుయరంద మనిధన్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1969 అన్నయుం పితవమ్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1970 ఎంగల్ తంగమ్ తమిళ మేకల పిక్చర్స్
1970 అనాదై ఆనందన్ తమిళ ముత్తువేల్ మూవీస్
1971 మై సుందర్ హూఁ హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1971 రంగరత్తినం తమిళ ఎస్.జె.ఫిలింస్
1972 పిళ్లైయొ పిళై తమిళ మేకల పిక్చర్స్
1972 ఇదయ వీణై తమిళ ఉదయం ప్రొడక్షన్స్
1972 అక్కా తమ్ముడు తెలుగు ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1974 సమయల్‌కరన్ తమిళ మెరీనా మూవీస్
1974 షాన్‌దార్ హిందీ
1974 పత్తు మాద బంధం తమిళ శ్రీ నవనీత ఫిలింస్
1974 కలియుగ కన్నన్ తమిళ అజంతా ఎంటర్‌ప్రైజస్
1975 వాళంతు కాత్తుగిరెన్ తమిళ ఎస్.ఎస్.కె.ఫిలింస్
1975 కాశ్మీరు బుల్లోడు తెలుగు
1975 అనయ విలక్కు తమిళ అంజుగం పిక్చర్స్
1976 వళ్వు ఏన్ పక్కం తమిళ ఎస్.ఎస్.కె.ఫిలింస్
1977 సొన్నతాయ్ సీవెన్ తమిళ
1977 ఇలయ తలైమురై తమిళ యోగచిత్ర ప్రొడక్షన్స్
1977 ఎన్న తావం సీతన్ తమిళ నలందా మూవీస్
1977 చక్రవర్తి తమిళ పి.వి.టి ప్రొడక్షన్స్
1978 పేర్ సొల్ల ఒరు పిల్లై తమిళ వాణి చిత్ర ప్రొడక్షన్స్
1978 అన్నపూర్ణి తమిళ విజయాంబిక ఫిలింస్
1979 వెల్లి రథం తమిళ అష్టలక్ష్మీ పిక్చర్స్
1979 నీల మలర్గల్ తమిళ శబరి సినీ క్రియేషన్స్
1979 నాదగమె ఉళగమ్ తమిళ విజయాంబిక ఫిలింస్
1980 మంగళ నాయగి తమిళ జె.సి.చౌదరి ఆర్ట్స్
1986 మలారం నినైవుగళ్ తమిళ మీనాక్షి ఫిలింస్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Film director Krishnan dead". The Indian Express. 17 July 1997. Archived from the original on 26 April 2013. Retrieved 21 January 2020.
  2. 2.0 2.1 Narwekar, Sanjit (1994). Directory of Indian film-makers and films. Flicks Books. p. 156. Archived from the original on 2013-10-09. Retrieved 2020-01-21.
  3. 3.0 3.1 Guy, Randor (31 July 2011). "Kuzhandaiyum Deivamum 1965". The Hindu. Archived from the original on 22 May 2018. Retrieved 21 January 2020.
  4. Poorvaja, S. (24 November 2016). "Film director Subhash dead". The Hindu. Archived from the original on 22 మే 2018. Retrieved 21 January 2020.
  5. 5.0 5.1 Guy, Randor (1 March 2014). "Araichimani or Manuneethi Chozhan (1942)". The Hindu. Archived from the original on 25 October 2016. Retrieved 21 January 2020.
  6. Guy, Randor (15 August 2008). "Manamagal 1951". The Hindu. Archived from the original on 13 March 2014. Retrieved 21 January 2020.
  7. லெனின், கோவி. "இரட்டையர்கள் கிருஷ்ணன்-பஞ்சு". Nakkheeran (in Tamil). Archived from the original on 9 December 2013. Retrieved 21 January 2020.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  8. 8.0 8.1 "பராசக்தி உள்பட பல வெற்றிப்படங்களை இயக்கிய கிருஷ்ணன்- பஞ்சு". Maalai Malar (in Tamil). 26 December 2011. Archived from the original on 4 March 2014. Retrieved 21 January 2020.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  9. Guy, Randor (19 June 2009). "Scripting cinema's role in politics". The Hindu. Archived from the original on 7 November 2012. Retrieved 21 January 2020.
  10. Gokulsing, K. Moti; Dissanayake, Wimal (17 April 2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. pp. 499–. ISBN 978-1-136-77291-7. Archived from the original on 29 జూన్ 2014. Retrieved 21 జనవరి 2020.
  11. Dwyer, Rachel (27 September 2006). Filming the Gods: Religion and Indian Cinema. Routledge. pp. 51, 139. ISBN 978-1-134-38070-1. Archived from the original on 29 జూన్ 2014. Retrieved 21 జనవరి 2020.

బయటి లింకులు

[మార్చు]