Jump to content

లేత మనసులు (1966 సినిమా)

వికీపీడియా నుండి
లేతమనసులు
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణన్ - పంజు
తారాగణం హరనాధ్,
జమున
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
నిర్మాణ సంస్థ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

లేత మనసులు 1966,సెప్టెంబర్ 16న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో హరనాథ్, జమున, జి.వరలక్ష్మి, బేబీ పద్మిని ముఖ్య తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం కృష్ణన్ పంజు.సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్ సమకూర్చారు. బహుళ ప్రజాదరణ పొందిన 'పిల్లలు దేవుడు చల్లని వారే' అనేపాట ఈ చిత్రంలోనిది.[1]

లేత మనసులు తమిళంలో విజయం సాధించిన కుళందయుం దైవముం చిత్రానికి రీమేక్. తమిళ సినిమాకు పనిచేసిన జంట దర్శకులు కృష్ణన్ - పంజు ఈ సినిమాకు కూడ దర్శకులుగా పనిచేశారు. తమిళ సినిమాలో నటించిన జమున, కుట్టి పద్మినిలు ఈ సినిమాలో కూడా నటించారు. ఈ చిత్రం 1966,సెప్టెంబర్ 16న విడుదలైయింది.[2]

శేఖర్ (హరనాథ్), సత్యభామ (జమున) సహాధ్యాయులు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. శేఖర్ అనాథ, తన తండ్రి అప్పు తీర్చేందుకు ప్రయత్నిస్తున్న శంభులింగం (రేలంగి) సహాయంతో చదువుకుంటాడు. శంభులింగం తన భార్య కనకదుర్గ (జి. వరలక్ష్మి) చేతిలో కీలు బొమ్మలా ఉంటాడు. చాలా కష్టపడి కనకదుర్గ ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది.

కవలలు పుట్టిన తర్వాత, శేఖర్ ఇంట్లో సర్దుకుపోలేకపోయాడు, ఎందుకంటే కనకదుర్గ తన స్నేహితులను పార్టీలో అవమానిస్తుంది. కోపంతో అతను ఒక కుమార్తెతో ఇంటి నుండి బయలుదేరాడు, అపస్మారక స్థితిలో ఉన్న సత్యభామ మరొక కుమార్తె కనకదుర్గతో ఉంటుంది.

శేఖర్ రంగూన్ చేరుకొని ఒక కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ క్రమంగా భాగస్వామి అవుతాడు. ఏడేళ్ల తర్వాత భారతదేశానికి తిరిగి వస్తాడు. ఆ ఇద్దరు కూతుళ్లు స్కూల్లో కలుసుకొని, వారు జంటలు అని గ్రహిస్తారు. ఇదే సమయంలో, శేఖర్ ఆస్తిపైన కన్నేసిన నిర్మల (గీతాంజలి) వలలో చిక్కుకుంటాడు. చివరికి ఆ ఇద్దరు కూతుళ్లు తమ తల్లిదండ్రులను ఒక్కటిగా చేసి, నిర్మల యోచనను విఫలంచేయడం కథ మిగతా వినోదభరితమైన భాగం.

తారాగణం

[మార్చు]
  • హరనాథ్
  • జూలూరి జమున
  • గరికపాటి వరలక్ష్మి
  • పద్మనాభం
  • రేలంగి వెంకట్రామయ్య
  • వహాబ్ ఖాసీం
  • జగ్గారావు
  • రమేష్
  • కాశీనాథ్ తాతా
  • దశరథరామరెడ్డి
  • గీతాంజలి
  • బేబీ పద్మిని
  • కనకం
  • మణిమాల
  • వి.ఆర్.తిలకం
  • మంజుల
  • సునీత .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కృష్ణన్ పంజు
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
  • కథ:సీతారామన్
  • మాటలు: డి వి నరసరాజు
  • పాటలు:ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య
  • నేపథ్య గానం: శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు
  • ఫోటోగ్రఫీ: విన్సెంట్- సుందరం
  • కూర్పు: ఎస్.పంజాబీ
  • నృత్యం: వెంపటి సత్యం , కె తంగప్పన్
  • కళ: ఎ. కె. శేఖర్
  • నిర్మాత: ఎ.వి.మొయ్యప్పన్
  • నిర్మాణ సంస్థ: ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్
  • విడుదల:1960.

పాటలు[3]

[మార్చు]
  • అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా - పి.బి.శ్రీనివాస్, పి. సుశీల
  • అందాల చెలికాడా అందుకో నాలేఖా నా కన్నీట రాశాను - పి. సుశీల, పి. బి.శ్రీనివాస్
  • కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో-పి.సుశీల- రచన:ఆరుద్ర
  • పిల్లలు దేవుడూ చల్లనివారే కల్ల కల్లకపటమెరుగని- పి.సుశీల
  • ఈ పువ్వులలో ఒక చల్లదనం నీ నవ్వులలో ఒక వెచ్చదనం- పి.సుశీల, పి బి. శ్రీనివాస్
  • హాల్లో మేడమ్ సత్యభామా పైన కోపం లోన ప్రేమా- పి.బి.శ్రీనివాస్, పి.నాగేశ్వరరావు
  • అందాల ఈరేయి నీదోయీ నీదోయీ పోనిస్తే మళ్ళీ రాదోయి- ఎస్.జానకి
  • మక్కువ తీర్చరా మువ్వా గోపాలా- పి.సుశీల .

విశేషాలు

[మార్చు]
  • కేవలం శుభం కార్డు (తిరుమల శ్రీ వేంకటేశ్వర సన్నిధి లో కుటుంబమంతయూ దైవదర్శనం చేసుకొనే) సన్నివేశం మాత్రం కలర్ లో చిత్రీకరించబడినది.

మూలాలు

[మార్చు]
  1. "Letha Manasulu (1966)". Indiancine.ma. Retrieved 2025-08-17.
  2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
  3. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.