ఎ.సి.త్రిలోకచందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Trilok chadar.jpg

ఎ.సి.త్రిలోకచందర్ భారతీయ సినిమా దర్శకుడు. ఆయన తెలుగులో రాము, నాదీ ఆడజన్మే, అవేకళ్లు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఆర్కాట్ ప్రాంతానికి చెందిన ఆయన పూర్తి పేరు ఎ. చెంగల్వరాయ ముదలియార్ త్రిలోకచందర్. అర్దశాస్త్ర్రంలో ఎం.ఏ చేసిన ఆయన సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ, సినిమాల్లోకొచ్చారు. తమిళ, తెలుగు, హిందీల్లో 65 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.ఎ.వి.ఎం.తో అనుబంధం ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్ద ఏవీఎం సంస్థ నిర్మించిన 'వీరతిరుమగళ్‌' చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 65 చిత్రాలకు దర్శకత్వం వహించారు.[1]

ఆయన తమిళ నటుడు శివకుమార్ (హీరో సూర్య తండ్రి)ని 'కాక్కుమ్ కరంగళ్' ద్వారా పరిచయం చేసారు. "భద్రకాళి" సినిమా ద్వారా మ్యూజిక్ డెరైక్టర్ ఇళయరాజాని తెలుగు సినిమాకు పరిచయం చేసారు. మురళీమోహన్, జయప్రద జంటగా నటించిన 'భద్రకాళి'ని డైరెక్ట్‌ చేసిన ఆయన, అదే కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం 'శాంతి'కి స్ర్కీన్‌ప్లే సమకూర్చారు.

ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో 'ఆస్కార్' అవార్డులకు మన దేశం తరుపున ఎంట్రీగా వెళ్ళిన తొలి దక్షిణ భారత సినిమా 'దైవ మగన్' కూడా త్రిలోకచందర్ దర్శకత్వం వహించినదే.

ఆయన వారపత్రికలకు చిన్న కథలను వ్రాసేవారు. ఆలిండియా రేడియోకు నాటకాలను కూడా రాసేవారు.[2]

ఆయన జూన్ 15 2016 న కన్నుమూసారు.

నినిమాలు[మార్చు]

తెలుగు సినిమాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

ఆయన కెరీర్ లో 5సార్లు 'ఫిల్మ్‌ఫేర్' అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ 'కలైమామణి' బిరుదు అందుకున్నారు. తమిళనాడు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌గా నాలుగుసార్లు బాధ్యతలు నెరవేర్చారు.

మూలాలు[మార్చు]

  1. ‘రాము’,‘అవే కళ్లు’,‘నాదీ ఆడజన్మే’చిత్రాల దర్శకుడు ఇక లేరు
  2. "Moorings and musings". MALATHI RANGARAJAN. The HIndu. 19 June 2016. Retrieved 24 March 2011.

ఇతర లింకులు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎ.సి.త్రిలోకచందర్ పేజీ