పవిత్ర హృదయాలు
'పవిత్ర హృదయాలు' తెలుగు చలన చిత్రం,1971 నవంబర్,24 న విడుదల.ఎ.సి.త్రిలోక చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జూలూరి జమున, చంద్రకళ, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య పాత్రలు పోషించారు.శ్రీవిజయ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నిర్మాత సి.సన్యాసిరాజు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
| పవిత్ర హృదయాలు (1971 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఎ.సి.త్రిలోకచందర్ |
| నిర్మాణం | సి.సన్యాసిరాజు |
| కథ | సి.సన్యాసిరాజు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి, చంద్రకళ |
| సంగీతం | టి.చలపతిరావు |
| గీతరచన | సింగిరెడ్డి నారాయణరెడ్డి |
| నిర్మాణ సంస్థ | పి.ఎస్.ఆర్. పిక్చర్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_రవీంద్రబాబు
- జూలూరి జమున_సుశీల
- చంద్రకళ_ విజయ
- గుమ్మడి వెంకటేశ్వరరావు_నాగేంద్రబాబు
- ఉప్పలదడియం నాగయ్య_జమిందార్ భుజంగరావు
- శాంతకుమారి_ అన్నపూర్ణమ్మ
- కైకాల సత్యనారాయణ_శేషగిరి
- ధూళిపాళ సీతారామశాస్త్రి_శివయ్య
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి_పోలీస్ ఆఫీసర్
- రాజనాల కాళేశ్వరరావు
- అల్లు రామలింగయ్య_పానకాలు
- పుణ్యమూర్తుల రాజబాబు_ బాబీ
- సంధ్యారాణి_ రాణి
- త్యాగరాజు_సుబ్బిగాడు
- పెరుమాళ్ళు_రామయ్య
- కె.వి.చలం
- పద్మ ఖన్నా.
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఎ.సి.త్రిలోక చందర్
సంగీతం: తాతినేని చలపతిరావు
గీత రచయిత:సింగిరెడ్డి నారాయణరెడ్డి
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, శిష్ట్లా జానకి,మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, వినోద్ కుమార్
కధ: సి.సన్యాసిరాజు, పినిశెట్టి శ్రీరామమూర్తి
చిత్రానువాదం: ఎ.సి.త్రిలోకచందర్
ఛాయ గ్రహణం: కె.ఎస్.ప్రసాద్
ఎడిటింగ్: కందస్వామి
నిర్మాత: సి.సన్యాసిరాజు
నిర్మాణ సంస్థ: శ్రీవిజయ వెంకటేశ్వర ఫిలింస్
విడుదల:24:11:1971.
పాటలు
[మార్చు]- కరుణామయి శారదా కమనీయగాన వరదాయిని - మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చినసత్యనారాయణ
- చుక్కల చీర కట్టుకొని మబ్బుల ముసుగు.. ఏమంటారు మీరే - ఘంటసాల
- చిరునవ్వుల చినవాడే పరువంలో ఉన్నాడే నామనసే - ఎస్.జానకి,ఘంటసాల బృందం
- నామది పాడిన ఈ వేళలొ నవజీవన వాహిని పొంగెనులే - ఘంటసాల
- పలికేది నేనైనా పలికించేది నీవేలే భావము నీవై రాగము - ఘంటసాల, జానకి
- మనసే మనిషికి తీయని వరము మనసులేని బ్రతుకే - వినోద్‌కుమార్
- శరణనన్న వారినే కరుణించే తిరుమలవాసా జగదీశా - ఎస్.జానకి
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
