Jump to content

రాము (1968 సినిమా)

వికీపీడియా నుండి
రాము
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.సి.త్రిలోకచందర్
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
రాజనాల,
రేలంగి
సంగీతం గోవర్దన్
నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్
భాష తెలుగు

సత్యజిత్ రే తీసిన 'పథేర్ పాంచాలి' సినిమా చూసి కిశోర్ కుమార్ వివశుడైపోయాడు. ఆ తరహాలో సినిమా తీయాలని 'దూర్ గగన్ కి ఛావ్' పేరుతో ఒక సినిమా తీశాడు. తండ్రి, మూగవాడైన కొడుకు మధ్య కథ. ఐతే సినిమా బాగా నడవలేదు. అదే కథను ఎ.వి.ఎమ్ వారు తమిళ, తెలుగు భాషల్లో తీశారు. తమిళంలో కూడా రాము పేరుతో విడుదల అయింది. ఈ సినిమాలో రామారావు మొదటి భార్యగా పుష్పలత నటించింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం- ఎ.సి.త్రిలోకచందర్
  • కథ, సంవిధానం - జావర్ సీతారాం
  • సంగీతం-ఆర్.గోవర్ధనం
  • మాటలు- డి.వి.నరసరాజు
  • పోరాటాలు- శ్యాంసుందర్
  • ఛాయాగ్రహణం- డి.రాజ్‌గోపాల్
  • కూర్పు-ఆర్.జి.గోపు
  • నృత్యం-ఎ.కె.చోప్రా
  • కధ: కిషోర్ కుమార్
  • పాటలు: దాశరథి కృష్ణమాచార్య, ఆరుద్ర
  • నేపథ్య గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి, మాధవపెద్ది సత్యం, ఎం.ఆర్.తిలకం, పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు
  • నిర్మాతలు: ఎం.శరవణన్, ఎం.బాలసుబ్రమణీయం, ఎం.ఎస్.గుహన్, ఎం.కుమరన్, ఎం.మురుగన్
  • నిర్మాణ సంస్థ: ఎ.వి.యం.ప్రొడక్షన్స్
  • విడుదల:04:05:1968.

మిలటరీనుంచి సిపాయి రాజా (ఎన్.టి.రామారావు) సెలవులకి ఇంటికి వచ్చి భార్య సీత (పుష్పలత) కొడుకు రాము (మాస్టర్ రాజ్‌కుమార్) తండ్రి వంటి పక్కింటి వెంకట్రామయ్య (పెరుమాళ్ళు)లతో సంక్రాంతి పండుగ జరుపుకొని, పైనుంచి టెలిగ్రాం రావటంతో తిరిగి యుద్ధానికి వెళతాడు. రాజా విజృంభించి, సైన్యంలో పోరాడడం, తోటి సిపాయి సింగన్న (రామదాసు) ఆ సమయంలో మరణించటం జరుగుతుంది. గజదొంగ పులి (సత్యనారాయణ) తన గుంపుతో రాజా గ్రామంపై దాడి చేసి దోపిడీలు సాగించి ఊరు తగలబెడతాడు. ఆ మంటల్లో సీత మరణించటం చూసిన రాము మూగవాడవుతాడు. సైన్యంనుంచి తిరిగి వచ్చిన రాజా, బిడ్డ రామూ, కుక్క జాకీతో మరోచోటికి ప్రయాణమై వెళతాడు. అనుకోకుండా సిపాయి సింగన్న కూతురు లక్ష్మి (జమున)గల గ్రామం చేరటం. ఆమె ఆస్తి అనుభవిస్తున్న ఆమె మేనమామ గంగన్న (రేలంగి) రంగన్న (రాజనాల)ల నుండి ప్లీడరు ద్వారా ఆమె స్వాధీనం చేసుకున్న ఆస్తిని కాపాడి, ఆమె పొలం సాగుచేసి, ఆ వూరి పేద రైతులకు, లక్ష్మికి అండగా నిలుస్తాడు. మూగవాడయిన రామును లక్ష్మి కన్నబిడ్డలా ఆదరిస్తుంది. రాజాపై ఆశలుపెంచుకున్న ఆమె ప్రేమను రాజా అంగీకరించడు.

వైద్యంకోసం మద్రాస్ వెళ్ళి, అది ఫలించక తిరిగి రాముతో గ్రామంచేరిన రాజా దోపిడి దొంగ ‘పులి’ ఆటకట్టించి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. రామూను, బంధించి లక్ష్మిని స్వాధీనం చేసుకోవాలనుకున్న రంగన్న, రాజా రాకతో, ఆ ఇంటికి నిప్పుపెట్టడం, మంటల్లో స్పృహ కోల్పోయిన లక్ష్మిని చూసి బందీగావున్న రామూ ‘అమ్మా’అని పిలవటంతో అతనికి ‘‘మాట’’రావటం జరుగుతుంది. రంగన్నను పోలీసులు అరెస్ట్‌చేయటం, అంతకుముందే, బావిలో కాలుజారిపడి గంగన్న మరణించటంతో మంచివాడు చిన్నవాడు వెంకన్న (పద్మనాభం) ఒంటరి వాడు కావటం, చివరకు రాజా, లక్ష్మీ ప్రేమను అంగీకరించి ఆమెతో జీవితం పంచుకోవటానికి అంగీకరించటంతో చిత్రం ముగుస్తుంది[1].

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేల వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమీ దాశరథి కృష్ణమాచార్య ఆర్.గోవర్ధనం ఘంటసాల
మామిడి కొమ్మ మల్లీ మల్లీ పూయునులే మాటలురాని కోయిలమ్మ కూయునులే దాశరథి ఆర్.గోవర్ధనం పి. సుశీల
పచ్చనిచెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు పాటలు పాడి జోకొట్టాలి జోజోజో ఆరుద్ర ఆర్.గోవర్ధనం పి.సుశీల
రారాకృష్ణయ్యా రారాకృష్ణయ్యా దీనులను కాపాడ రారాకృష్ణయ్యా దాశరథి కృష్ణమాచార్య ఆర్.గోవర్ధనం ఘంటసాల

అక్కరకు రాని చుట్టము ,(పద్యం) సుమతీ శతకము నుండి, గానం. పి. సుశీల

తారాశసాంకం (నాటకం) గానం.ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది , పిఠాపురం , ఎం.ఆర్.తిలకం బృందం .

మూలాలు

[మార్చు]
  1. "రాము- -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 14-04-2018". Archived from the original on 2018-08-14. Retrieved 2018-10-26.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటిలింకులు

[మార్చు]