స్త్రీ హృదయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్త్రీ హృదయం
(1961 తెలుగు సినిమా)
Stree hrudayam.jpg
దర్శకత్వం శ్రీధర్
తారాగణం జెమినీ గణేశన్,
పద్మిని,
తంగవేలు,
టి.ఆర్.రామచంద్రన్,
కె.నటరాజన్,
తాంబరం లలిత,
మనోరమ
సంగీతం నిత్యానంద్
గీతరచన అనిసెట్టి సుబ్బారావు
నిర్మాణ సంస్థ నవ్యకళామందిర్
భాష తెలుగు

స్త్రీ హృదయం 1961లో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాకు మూలం 1960లో వెలువడిన మీంద సొర్గమ్‌ అనే తమిళ సినిమా. ఈ సినిమా 1961, జూలై 28వ తేదీన విడుదలయ్యింది.

సాంకేతిక వర్గం[మార్చు]

తారాగణం[మార్చు]

  • జెమినీ గణేశన్ - శేఖర్
  • పద్మిని - నిర్మల
  • తాంబరం లలిత - ప్రతిభ
  • తంగవేలు - సచ్చిదానందం
  • టి.ఆర్.రామచంద్రన్
  • కె.నటరాజన్ - అమృతయ్య
  • మనోరమ
  • పి.ఎస్.వెంకటాచలం - దొరస్వామి

పాటలు[మార్చు]

కథ[మార్చు]

ధనవంతుని కుమారుడు, కళాభిమాని అయిన శేఖర్ (జెమినీ గణేశన్) నిర్మల (పద్మిని) అనే పేదపిల్లను చూస్తాడు. ఆమె తండ్రి పాముకాటుకు చనిపోగా ఆమె అనాథ అవుతుంది. ఆమెపై జాలికలిగి ఆమెను పట్నం తీసుకువెళ్లి ఒక నాట్యాచార్యుని వద్ద నాట్యవిద్యకు ప్రవేశ పెడతాడు. నాట్యాచార్యుడు అమృతయ్య (కె.నటరాజన్) నిర్మలలోని కళాతృష్ణను గుర్తించి ఆమెను ఉత్తమ నర్తకిగా తీర్చిదిద్దడానికి పూనుకుంటాడు. కానీ శేఖర్ నుండి అమృతయ్య ఆ సమయంలో ఒక మాట తీసుకుంటాడు. నిర్మల జీవితం పూర్తిగా కళకే అంకితం కావాలన్నదే ఆ వాగ్దానం. నిర్మలలో అంతదాకా శేఖర్ మీద ఉన్న భక్తి భావాలు క్రమంగా ప్రేమగా మారి శేఖర్‌ను పెళ్లాడాలనే కోరికను కలిగిస్తాయి. నిర్మలను పెళ్లాడితే ఆమె కళోపాసనకు ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయంతో ఇష్టం లేకపోయినా ప్రతిభ (తాంబరం లలిత) అనే డబ్బున్న అమ్మాయిని తన తండ్రి చేసిన లక్షరూపాయల అప్పు తీరుతుందనే అభిప్రాయంతో పెళ్లాడుతాడు. ప్రతిభ తండ్రి సచ్చిదానందం(తంగవేలు), శేఖర్ తండ్రి దొరస్వామి(పి.ఎస్.వెంకటాచలం) మిత్రులు. దొరస్వామి బ్యాంకు వారికి పడిన లక్షరూపాయల బాకీ తను తీరుస్తానని మాట ఇస్తాడు సచ్చిదానందం. దాంతో శేఖర్, ప్రతిభల పెళ్ళి జరుగుతుంది. కానీ శేఖర్ నిర్మలను చూడడానికి వెళుతూ వస్తూవుండడంతో ప్రతిభ అపార్థం చేసుకుని శేఖర్‌తో గొడవపడి పుట్టింటికి వెళుతుంది. ప్రతిభ తన భర్త తనను ప్రేమించడం లేదని తండ్రికి చాడీలు చెబుతుంది. దానితో సచ్చిదానందం బ్యాంకు బాకీ లక్షకు నోటీసు ఇప్పించి ఇల్లును వేలం వేయిస్తాడు. ఈ అవమానం భరించలేక దొరస్వామి చనిపోతాడు. శేఖర్ ఈ బాధలను దిగమింగి ఊరు వదిలి వెళ్లిపోతాడు. తన కోసం నిలిచిన శేఖర్ కోసం తన సర్వశక్తులు ధారపోసి అతని ఇల్లు నిలబెట్టాలని నిర్మల నిర్ణయిస్తుంది. దేశమంతటా బహిరంగ నాట్యప్రదర్శనలు ఇచ్చి లక్ష రూపాయలు సంపాదించి వేలం వేస్తున్న బ్యాంకు వారికి అందజేస్తుంది. తన పొరబాటును, తొందరబాటును గ్రహించిన ప్రతిభ ఆత్మహత్య చేసుకుంటుంది. చివరకు శేఖర్, నిర్మలలు వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది[1].

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (4 August 1961). "చిత్ర సమీక్ష: స్త్రీ హృదయం" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived (PDF) from the original on 20 సెప్టెంబర్ 2022. Retrieved 20 September 2022. {{cite news}}: Check date values in: |archive-date= (help)