పద్మిని (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మిని
Padmini.jpg
జననం(1932-06-12) 1932 జూన్ 12
తిరువనంతపురం, ట్రావన్కోర్, కేరళ
మరణం2006 సెప్టెంబరు 25 (2006-09-25)(వయసు 74)
చెన్నై, తమిళనాడు
వృత్తినటి, నృత్యకళాకారిణి
జీవిత భాగస్వామిరామచంద్రన్
పిల్లలుప్రేమానంద
తల్లిదండ్రులు
  • గోపాల పిళ్లై (తండ్రి)
  • సరస్వతమ్మ (తల్లి)

పద్మిని ప్రముఖ సినిమా నటి మరియు నర్తకి. ఈమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె మరియు ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందారు.

విశేషాలు[మార్చు]

ఈమె 1932, జూన్ 12వ తేదీన జన్మించింది. ఈమె తొలిసారి తన 14వయేట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. తరువాత 30 సంవత్సరాలు తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించింది. ఈమె శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్‌ కపూర్, షమ్మీ కపూర్, ప్రేమ్‌ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించింది. ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 59 చిత్రాలలో నటించింది[1].

ఈమె అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టరును 1961లో వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది. 1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక డ్యాన్స్ స్కూలును ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కూలు అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దదిగా పేరుపొందింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు.

ఈమె చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2006, సెప్టెంబరు 24 తేదీన గుండెపోటుతో మరణించింది.

తెలుగు సినిమాల జాబితా[మార్చు]

ఈమె నటించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:

విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1950 తిరుగుబాటు సి.హెచ్. నారాయణరావు, శాంతకుమారి పి.పుల్లయ్య
1950 బీదలపాట్లు చిత్తూరు నాగయ్య, లలిత కె.రామనాథ్
1951 ఆడ జన్మ సి.హెచ్. నారాయణరావు, బి.ఎస్.సరోజ జి.ఆర్. రావు
1951 చంద్రవంక కాంచన్, కనకం
1951 పెళ్లికూతురు ఎన్.ఎస్.కృష్ణన్, లలిత ఎన్.ఎస్.కృష్ణన్
1952 కాంచన కె.ఆర్.రామస్వామి, లలిత ఎస్.ఎం.శ్రీరాములు
1952 ధర్మ దేవత శాంతకుమారి, రేలంగి వెంకట్రామయ్య పి.పుల్లయ్య
1952 సింగారి టి.ఆర్.రామచంద్రన్, లలిత, రాగిణి
1953 అమ్మలక్కలు ఎన్.టి.రామారావు, లలిత డి.యోగానంద్
1953 ఒక తల్లి పిల్లలు టి.ఎస్.దొరైరాజు, లలిత ఎ.ఎన్.ఎ.స్వామి
1953 ప్రపంచం చిత్తూరు నాగయ్య, జి.వరలక్ష్మి ఎస్.ఎల్.రామచంద్రన్
1954 అమర సందేశం అమర్‌నాథ్, శ్రీరంజని ఆదుర్తి సుబ్బారావు
1955 అంతా ఇంతే శివాజీ గణేషన్, లలిత, రాగిణి ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి ఎన్.టి.రామారావు, లలిత, రాగిణి డి.యోగానంద్
1956 అమరజీవి శివాజీ గణేషన్, సావిత్రి టి.ప్రకాశరావు
1956 సాహస వీరుడు ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి డి.యోగానంద్
1958 వీరప్రతాప్ శివాజీ గణేశన్ టి.ప్రకాశరావు
1959 గొప్పింటి అమ్మాయి శివాజీ గణేశన్, రాజసులోచన
1959 వీరపాండ్య కట్టబ్రహ్మన శివాజీ గణేశన్, ఎస్.వరలక్ష్మి బి.ఆర్.పంతులు
1960 దేసింగురాజు కథ ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి పి.ఆర్.రఘునాథ్
1961 అనుమానం శివాజీ గణేశన్ కృష్ణన్ పంజు
1961 కత్తిపట్టిన రైతు ఎం.జి. రామచంద్రన్ ఎ.ఎస్.ఎ.స్వామి
1961 కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం శివాజీ గణేశన్ ఎ.ఎస్.ఎ.స్వామి
1961 మాయా మశ్చీంద్ర నిరుపారాయ్ బాబూభాయ్ మిస్త్రీ
1962 ఏకైక వీరుడు ఎం.జి.రామచంద్రన్, అంజలీదేవి నటేశన్
1963 రాణీ సంయుక్త ఎం.జి.రామచంద్రన్, రాగిణి డి.యోగానంద్
1966 మోహినీ భస్మాసుర ఎస్వీ.రంగారావు, కాంతారావు బి.ఎ.సుబ్బారావు
1967 ముద్దు పాప శివాజీ గణేశన్ కె.ఎస్.గోపాలకృష్ణ
1967 వసంత సేన అక్కినేని నాగేశ్వరరావు బి.ఎస్.రంగా
1968 విజయకోట వీరుడు జెమినీ గణేశన్, వైజయంతిమాల ఎస్.ఎస్.వాసన్
1969 రాజ్యకాంక్ష జెమినీ గణేశన్, రాగిణి జి.విశ్వనాథం

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]