Jump to content

రాగిణి (నటి)

వికీపీడియా నుండి
రాగిణి
రాగిణి
జననం(1937-03-27)1937 మార్చి 27
తిరువనంతపురం, ట్రావన్కోర్, కేరళ
మరణం1976
మరణానికి కారణం
బ్రెస్ట్ క్యాన్సర్
వృత్తినటి, నృత్యకళాకారిణి
జీవిత సహచరిమాధవన్ థంపి
పిల్లలులక్ష్మి, ప్రియ
Parents
  • గోపాల పిళ్లై (father)
  • సరస్వతమ్మ (mother)

రాగిణి భారతీయ సినిమానటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో చివరి సోదరీమణి.

విశేషాలు

[మార్చు]

ఈమె 1937, మార్చి 27న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అనేక నాటకాలలో కూడా నటించింది. ఈమె అక్కలులలిత, పద్మినిలు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది[1]. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె మాధవన్ థంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు కలిగారు. ఈమె భర్త ఈమెను వదిలి 1974లో అమెరికా వెళ్ళాడు. కానీ ఈమె కేన్సర్‌ బారిన పడ్డ తరువాత తిరిగి వచ్చాడు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ 1976లో మృతిచిందింది.

తెలుగు సినిమాల జాబితా

[మార్చు]

లలిత నటించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:

విడుదలైన సంవత్సరంసినిమా పేరుఇతర నటులుదర్శకుడు
1952సింగారిటి.ఆర్.రామచంద్రన్, లలిత, పద్మిని
1955అంతా ఇంతేశివాజీ గణేశన్, లలిత, పద్మినిఆర్.ఎం.కృష్ణస్వామి
1955విజయగౌరిఎన్.టి.రామారావు, లలిత, పద్మినిడి.యోగానంద్
1957వరుడు కావాలిజగ్గయ్య, పి.భానుమతి,అమర్‌నాథ్పి.ఎస్.రామకృష్ణారావు
1958పులి చేసిన పెళ్లిసత్యం, ముత్తయ్యపి.భాస్కరన్
1961స్త్రీ జీవితంశివాజీ గణేశన్,పద్మినిపి.భాస్కరన్
1963రాణీ సంయుక్తఎం.జి.రామచంద్రన్, పద్మినిడి.యోగానంద్
1964వీర సేనాపతిప్రేమ్ నవాజ్, తిక్కురిస్సి సుకుమారన్ నాయర్జి.విశ్వనాథం
1965చలాకీ పిల్లశ్రీరాం, టి.ఆర్.రామచంద్రన్, తంగవేలుకె. సోము
1969రాజ్యకాంక్షజెమినీ గణేశన్, పద్మినిజి.విశ్వనాథం
1974కోటివిద్యలు కూటికొరకేనగేష్, లక్ష్మికె.బాలచందర్

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]