Jump to content

పులి చేసిన పెళ్లి

వికీపీడియా నుండి
పులి చేసిన పెళ్లి
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.భాస్కరన్
తారాగణం సత్యం,
ముత్తయ్య
ఎస్.పి.పిళ్ళె,
రాగిణి,
ప్రేమ,
పంకజవల్లి
సంగీతం జీవన్
గీతరచన రావూరు
నిర్మాణ సంస్థ శరత్ ఫిలిమ్స్
భాష తెలుగు

పులి చేసిన పెళ్లి 1958లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మూలం మలయాళంలో జనాదరణ పొందిన నాయరు పిడిచ పులివళు అనే సినిమా.

నటీనటులు

[మార్చు]
  • రాగిణి
  • సత్యన్
  • ప్రేమ మేనన్
  • పంకజవల్లి
  • టి.ఎస్.ముత్తయ్య
  • ఎస్.పి.పిళ్లై
  • బహదూర్

ఒక ఊళ్లో సర్కస్ కంపెనీ దిగుతుంది. ఆ ఊళ్లో రెండే రెండు హోటళ్లుంటాయి. సర్కస్ కంపెనీ జనాభాకి భోజనాలు సరఫరా చేసే బేరం కోసం హోటల్ యజమానులు చెల్లప్పా, నాగన్న పోటీ పడతారు. సర్కస్‌లో ఫీట్లు చేసే చంద్రం ద్వారా బేరం నాగన్నకి దక్కుతుంది. చంద్రాన్ని ఒకప్పుడు నాగన్న ఆశ్రయం ఇచ్చి పెంచాడు. ఇప్పుడు ఇలా అనుకోకుండా కలుసుకోవడం జరిగింది. చంద్రం నాగన్న ఇంటికి వెళ్లి నాగన్న కూతురు, తన బాల్య స్నేహితురాలు అయిన రాజ్యాన్ని చూస్తాడు. వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సర్కస్ బేరంతో నాగన్న బాగుపడుతున్నాడని చెల్లప్ప, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న రాజ్యాన్ని చంద్రానికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడన్న కోపంతో గోపి అనే రౌడీ నాగన్నపై పగబడతారు. ఫలితంగా ఫీట్లు చేసే చంద్రం చెయ్యి విరిగిపోతుంది. అందువల్ల సర్కస్ వసూళ్లు పడిపోతాయి. దాని మూలంగా నాగన్నకి వాళ్లు పెద్ద మొత్తాలు బాకీ పడతారు. చివరికి నాగన్న అప్పుల్లో మునిగిపోతాడు. దీనికి తోడు సర్కస్ కంపెనీ వారు డేరా ఎత్తేసి బాకీక్రింద జంతువుల్ని జమచేస్తూ నాగన్న గుమ్మం ముందు వదిలేసి వెళతారు. ఆ జంతువులను సాకడం మరింత కష్టంగా మారుతుంది నాగన్నకు. గోపీ తనకు రాజ్యాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే సమస్యలన్నింటినీ తీర్చివేస్తానని నాగన్నతో అంటాడు. గత్యంతరం లేక నాగన్న అందుకు అంగీకరిస్తాడు. గోపీతా రాజ్యానికి పెళ్లి చేసే సమయంలో క్రూరజంతువు వచ్చి పెళ్లి జరగకుండా పోలీసులు వచ్చేవరకూ దుష్టుల్ని అట్టే నిలబెట్టి ఉంచుతుంది. పోలీసులు దుష్టుల్ని అరెస్టు చేసి, చంద్రం రాజ్యాల పెళ్లితో కథ సుఖాంతమౌతుంది[1].

పాటలు

[మార్చు]
  1. ఎందుకింక పంచదార మోజు చెప్పాలి ... రాజ్యం మోజు చెప్పాలి -
  2. కంటిచినుకే కాంచ నేరవా కార్మోయిల్ వర్ణా బాళీ నిలిచే -
  3. కాచుక్కూర్చున్నావు కస్తూరి మామిడి కాకి కొట్టుకపోవునయ్యో -
  4. కాలు బిగించిన పులిరన్న పులివాలు బిగించిన నాగన్న
  5. పట్టుచీరలేదుగా బొట్టుదిద్ద లేదుగా ఐనగాని ఎందుకోయీ -
  6. వెన్నంటి పిల్లా వెన్నంటి పిల్లా మనస్సు దాచావు నీ మనస్సు -

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (7 September 1958). "'పులి చేసిన పెళ్లి '". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 29 January 2020.[permanent dead link]