ఆడ జన్మ
ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా ఆడజన్మ (1970 సినిమా)
ఆడ జన్మ (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.ఆర్. రావు |
---|---|
తారాగణం | సి.హెచ్.నారాయణరావు, లింగమూర్తి, శర్మ, దొరైస్వామి, బి.ఎస్.సరోజ, గిరిజ, లలిత, పద్మిని, కమల |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నిర్మాణ సంస్థ | మోడ్రన్ థియేటర్స్ లిమిటెడ్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆడజన్మ అన్న సినిమా జి.ఆర్.రావు దర్శకత్వంలో సిహెచ్.నారాయణరావు, బి.సరోజ ప్రధాన పాత్రధారులుగా నటించిన 1951 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాను మోడరన్ థియేటర్స్ పతాకంపై మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ వారు నిర్మించారు. దీనికి తోలేటి రచన చేయగా, ఎస్.దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు. నృత్య దర్శకులుగా సింహా, హీరాలాల్, రంగవిఠల్, మాధవన్ వ్యవహరించారు. సినిమాను మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ స్టూడియోలో సేలం ప్రాంతంలో చిత్రీకరించారు. పూర్ణా వారు పంపిణీదారులుగా వ్యవహరించారు.[1]
కథ సంగ్రాహం
[మార్చు]మద్రాసులో విలాస వంతమైన భవనాల్లో నివసిస్తున్న రావుసాహెబు ఒకప్పుడు సిరిపురం పూరిగుడిసెల్లో నివసించిన కుటుంబరావు.ఆతని భార్య పార్వతి. దేవకి,లీల అతని కుమార్తెలు. ఆనాడు అన్న వస్త్రాలకు కుడా అల్లాడిన కుటుంబరావు, పొరిగింటి నరసయ్య ఏకైక కుమారుడు రఘుకి,దేవకి నిచ్చి,వరదక్షిణ లేకుండా బాల్య వివాహంచేస్తాడు. వియ్యంకుడు కుటుంబరావు వ్యాపారం చేసుకుంటానంటే ధనం యిచ్చి పట్నంపంపింది నరసయ్యే.
కాలంమారింది,ఇప్పుడు కుటుంబరావు లక్షాదికారియైన రావుసాహెబ్,నరసయ్య ఆర్థికంగ చితికి పోయాడు. కుటుంబరావు తన రెండవ కుమార్తె లీలను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. నరసయ్య తన కోడలు దేవకీని కాపరానికి పంపమని అడుగగా కుటుంబవురావు ధనహంకారంతో దరిద్రులింటికి తన కూతుర్ని పంపనని నరసయ్యను అవమాన పరిచి పంపుతాడు.
భర్త ప్రత్యక్ష దైవం అని నమ్మిన దేవకి తల్లి సహాయంతో తండికి తెలియకుండా అత్తారింటికి వెళ్తుంది. ఇది తెలిసి కోపంలో పరవళ్లుతొక్కుతాడు కుటుంబరావు. అత్తారింటికి వచ్చిన దేవకి, అకస్మాత్తుగా పక్షవాతంలో తగులుకున్న భర్తను, మామ నరసయ్య మరణాన్ని చూస్తుంది. భర్త ఆరోగ్యం కోసం నగా నట్ర అన్నీ విక్రయించి వైద్యం చేయిస్తుంది, కాని గుణంకలుగలేదు కటిక దరిద్రం అనుభవిస్తూ దేవకి తండ్రి సహాయం అపేక్షిస్తుంది. దయాశూన్యుడైన కుటుంబ రావు దేవకిని కాలదంతాడు. నిరాధారమైన దేవకి అందానికి ముగ్ధుడైన శేషు ఆమెను వశపరచుకోడానికి గాలం వేస్తాడు. రఘూకి సహాయం చేసినట్లు నటించి, చిట్టి అనే వేశ్యయింట్లో దేవకిని దాసీగా కుదురుస్తాడు. లండన్ నుండి తిరిగి వచ్చిన లీల, దేవకిని చూడ్డానికి ఆరాటపడుతుంది. ఆటంకపరిచిన కుటుంబరావు తన ఆఫీసు కార్యదర్శి భూషణాన్ని పెళ్ళి చేసుకోమని లీలను నిర్భంధిస్తాడు.ఎదురు తిరుగుతుంది. కోపగించి ఆమెను గదిలో పెట్టి తాళం వేస్తాడు. కిటికీలోనుంచి తప్పించుకొని తమ కుటుంబానికి చిరపరిచితుడైన రాఘవయ్యను కలుసుకోడానికి తెనాలి చేరుతుంది లీల. అక్కడికి వచ్చిన తమ ఆఫీసు మేనేజరు ప్రకాష్ రాఘవయ్య కొడుకని తెలుస్తుంని యిద్దరూ దేవకిని వెతకటానికి బయల్దేరుతారు. సిరిపురంలో దేవకి కనిపించకపోవడంతో ఊరూరూ వెతుకుతుంటారు.
లీల కోసం కుటుంబరావు, పేపర్లో పకటన యిస్తాడు. దేవకి పుత్తూరులో ఒకనాటు వైద్యుడింట్లో రఘూకి వైద్యం చేయిస్తూ పాలూ పెరుగూ అమ్మి జీవిస్తుంటుంది.వైద్యుడు దేవకిని పొందగోరుతాడు. కష్టాలు అనుభవిస్తూ దేవకీ భర్తతో సంజీవికొండ చేరుతుంది.
చిన్న భోజనశాల పెట్టి భర్తను కాపాడుతుంటుంది. ఒకనాడు పెద్దగాలితో వడగళ్లవాసకురుస్తుంది. కట్టెపుల్లలకై పోయిన రఘూ ఆ గాలివానలో చిక్కుకొని మంచుతో కప్పబడతాడు.ఎన్ని మందులిచ్చినా గుణమివ్వని పక్షవాతం సంజీవికొండ మంచువల్ల క్షణంలో నయమవుతుంది. దేవకి రఘూ జీవితాలలో వసంతాలు పుష్పించినవి. చిన్న భోజనశాల కాస్తా మైసూరులో దేవకి భవనం అన్న పేరిట పెద్ద వసతిగృహమవుతుంది. రఘూ లక్షాధిపతి అవుతాడు, అదృష్టం వల్ల ఆడపిల్ల కలుగుతుంది.
దేవకిని పొందుదామనుకున్న శేషూ, రఘుని చిట్టి మైకంలో పడవేస్తాడు. మగడు పరాయివాడయ్యాడు.శేషు చేసిన దుర్భోధల వల్ల దేవకిని తన్ని తరిమేస్తాడు రఘు.కూతురు పాప, చిట్టి కారు కిందపడుతుంది. తండ్రిని చూస్తే గాని పాప జీవించదని డాక్టరు చెప్తాడు. రఘూకోసం వెళ్తున్న దేవకీని నమ్మించి, బలాత్కరించపోతాడు శేషు. కాని లీల, ప్రకాష్ లు సమయానికి వచ్చి శేషూని తన్ని దేవకిని కాపాడుతారు.అక్క దుర్భర జీవితాన్ని విన్న లీల రఘూకి గుణపాఠం నేర్పడానికి సిద్ధపడుతుంది.పసిపాప రఘూ కారు కిందపడి పాణాపాయంలో వున్నదని, పోలీసులకు ఫోనుచేస్తానని బెదిరిస్తుంది. దేవకి అడ్డునిలుస్తుంది.కూతురు మైసూరులో వుందని తెలుసుకున్న కుటుంబరావు రాఘవయ్యతో మైసూరువస్తాడు.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకత్వం - జి.ఆర్.రావు
- రచన - తోలేటి వెంకటరెడ్డి
- నిర్మాత - మాడరన్ థియేటర్స్ లిమిటెడ్
- సంగీతం - ఎస్.దక్షిణామూర్తి, పి.నాగేశ్వరరావు
- నృత్యం - సింహా, హీరాలాల్, రంగవిఠల్, మాధవన్
నటీనటులు
[మార్చు]- రఘు గా సి.హెచ్.నారాయణరావు
- ప్రకాశ్ గా రామశర్మ
- శేషు గా అడ్డాల
- కుటుంబరావు గా లింగమూర్తి
- దేవకి గా బి.ఎస్.సరోజ
- లీల గా గిరిజ
- చిట్టి గా లక్షీప్రభ
- పార్వతి గా ఎస్.ఆర్.జానకి
మూలాలు
[మార్చు]- ↑ ఆడజన్మ సినిమా పాటల పుస్తకం
*