బి.ఎస్.సరోజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.ఎస్.సరోజ
ఆంధ్రపత్రిక కవరుపేజీపై బి.ఎస్.సరోజ
జననం (1929-11-18) 1929 నవంబరు 18 (వయసు 94)
తిరువనంతపురం, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1951–1978
జీవిత భాగస్వామిటి.ఆర్.రామన్న
పిల్లలుగణేష్, కళారాణి, శాంతి
బంధువులుటి.ఆర్.రాజకుమారి (మరదలు)

బి.ఎస్.సరోజ(జననం:18 నవంబర్ 1929) 1950వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె తండ్రి జాన్సన్ మొదటి మలయాళ సినిమా విగత కుమారన్‌లో నటించాడు.[1] ఈమె భర్త టి.ఆర్.రామన్న సౌండ్ ఇంజనీర్‌గా చిత్రసీమలో పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె 1929, నవంబర్ 18న తిరువనంతపురంలో జాన్సన్, రాజలక్ష్మి దంపతులకు జన్మించింది. ఈమె 4వ తరగతి వరకు చదువుకుంది. తర్వాత ఒక సర్కస్ కంపెనీలో చేరి దేశం అంతా చుట్టివచ్చింది. తర్వాత తమిళ సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. జీవితనౌక అనే మలయాళ సినిమా పూర్తిస్థాయి నటిగా ఈమె తొలి సినిమా.[2] తరువాత ఈమె అనేక సినిమాలలో నటించింది.[3]ఈమె 1949లో టి.ఆర్.రామన్నను వివాహం చేసుకుంది. ఇతడు తమిళసినిమాలలో సౌండ్ ఇంజనీరుగా పనిచేసి తర్వాత దర్శకుడిగా మారాడు. ఈ జంట ఆర్.ఆర్.పిక్చర్స్, వినాయక పిక్చర్స్, గణేశ్ పిక్చర్స్ అనే మూడు నిర్మాణ సంస్థలను ప్రారంభించి సినిమాలను నిర్మించింది. వీరికి ముగ్గురు పిల్లలు. వారు చెన్నైలో స్థిరపడ్డారు.

చిత్రమాలిక[మార్చు]

ఈమె నటించిన కొన్ని తెలుగు సినిమాలు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-07-03. Retrieved 2020-02-28.
  2. "Archived copy". Archived from the original on 14 అక్టోబరు 2014. Retrieved 7 ఆగస్టు 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. http://www.malayalachalachithram.com/profiles.php?i=4825

బయటి లింకులు[మార్చు]