వసంత సేన (సినిమా)
| వసంత సేన (1967 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | బి.ఎస్.రంగా |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని, సత్యనారాయణ, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు, రేలంగి |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | విక్రం ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
ఈ సినిమా శూద్రకుడు రచించిన సుప్రసిద్ధ సంస్కృత నాటకం మృచ్ఛకటికమ్ ఆధారంగా నిర్మించబడింది[1]. వసంత సేన చిత్రం 1967లో, బి. ఎస్ రంగా దర్శకత్వంలో, విక్రం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో, అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని, కృష్ణకుమారి, నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
కథాసంగ్రహము
[మార్చు]రమారమి 2000 సంవత్సరాల క్రితం సకల కళలకు, సర్వసంపదలకు నిలయమైన ఉజ్జయినీ నగరంలో చారుదత్తుడు అనే శీల సంపన్నుడైన బ్రాహ్మణుడు ఉంటాడు. ఇతడు ధనసంపన్నుడు. కళాపిపాసి. వేశ్యామణి అయిన వసంతసేన సంగీతనాట్యాలలో ఆరితేరిన సౌశీల్యవతి. వీరిద్దరూ ఒకరినొకరు కలిసి ప్రేమలో పడక ముందే ఉజ్జయినీ నగరం శత్రువుల హస్తగతమౌతుంది.
ఉజ్జయినిని జయించిన పౌలక మహారాజు తన బావమరిది అయిన శకారుని రాజప్రతినిధిగా నియమిస్తాడు. శకారునివి అన్నీ అవగుణాలే. ప్రత్యేకంగా అతని దృష్టి వసంతసేనపై పడింది. కాని వసంతసేన అతడిని ధిక్కరించి నిలిచింది. స్వాతంత్ర్యం కోల్పోయిన తన ప్రజల కోసం చారుదత్తుడు సర్వస్వాన్ని కోల్పోయి పేదవాడవుతాడు. ఆర్యకుడు అనే మారుపేరుతో విప్లవవీరుడిగా మారి ఇదివరకు బానిసతనం నుండి తాను విముక్తి చేసిన అనంగసేన అనే వీరవనితతో కలిసి సైన్యాన్ని సమీకరిస్తాడు. శర్విలకుడు అనే చోరశిఖామణి ఈ సైన్యాలకు బాసటగా ఉంటాడు.
శర్విలకుడు వసంతసేన వద్ద దాసిగా ఉన్న మదనికను ప్రేమిస్తాడు. చారుదత్తుని ఇంటికి కన్నంవేసి అక్కడ దాచివుంచిన వసంతసేన నగలను దొంగిలించి వాటినే వసంతసేనకు సమర్పించి మదనికను విడిపించి పెళ్ళి చేసుకుంటాడు.
ఎన్నివిధాలుగా ప్రయత్నించినా లొంగని వసంతసేనను శకారుడు అడవిలోకి తీసుకుపోయి గొంతు నులిమగా ఆమె సొమ్మసిల్లిపోతుంది. వసంతసేన చనిపోయిందని భావించి శకారుడు ఆ హత్యానేరాన్ని చారుదత్తునిపై మోపగా అతడికి ఉరిశిక్ష విధించబడుతుంది.
ఈ వార్త వసంతసేన విని తన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయక దండనస్థానానికి పరిగెడుతుంది. చివరి క్షణంలో చారుదత్తుడు రక్షింపబడతాడు. ప్రజలు శకారుడిని శిక్షిస్తారు. ఉజ్జయినికి స్వాతంత్ర్యం లభిస్తుంది. కథ సుఖాంతమవుతుంది.
పాత్రలు - పాత్రధారులు
[మార్చు]- చారుదత్తుడు : అక్కినేని నాగేశ్వరరావు
- శకారుడు : ఎస్.వి.రంగారావు
- వసంతసేన : పద్మిని
- దూతాదేవి : అంజలీదేవి
- అనంగసేన: కృష్ణకుమారి
- ఆర్యక: కైకాల సత్యనారాయణ
- మైత్రియ: వల్లూరి బాలకృష్ణ
- అర్విలక: రేలంగి వెంకట్రామయ్య
- మదనిక: గిరిజ
- సవిత .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బి.ఎస్.రంగా
- సంగీతం:సాలూరు రాజేశ్వరరావు
- సంభాషణలు: వెంపటి సదాశివ బ్రహ్మం
- గీత రచయితలు: శ్రీరంగం శ్రీనివాసరావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి
- గాయనీ గాయకులు: శిష్ట్లా జానకి, పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, పి.లీల , బొడ్డుపల్లి బాల వసంత, ప్రతివాది భయంకర శ్రీనివాస్
- ఫోటోగ్రఫీ: బి.ఎస్.రంగా, బి.ఎస్.హయాస్
- ఎడిటింగ్: పి.జె.మోహన్, ఎం.దేవేంద్రనాథ్ , టి.చక్రపాణి
- నృత్యాలు: హీరాలాల్, చిన్ని_ సంపత్, ఎ.కె.చోప్రా
- ఆర్ట్: వాలి, సుధీదురై
- పంపిణీదారులు: నవయుగ ఫిలింస్
- నిర్మాత: బి.ఎస్.రంగా
- నిర్మాణ సంస్థ: విక్రం ప్రొడక్షన్స్
- విడుదల:12:08:1967.
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేశాడు.[2]
| క్రమ సంఖ్య | పాట | రచయిత | గాయకులు |
|---|---|---|---|
| 1 | ఓహో వసంత యామినీ యామినీ యామినీ నిను వర్ణింతును ఏమనీ ఏమనీ ఏమనీ | సి.నారాయణరెడ్డి | పి.బి.శ్రీనివాస్ |
| 2 | బంగారు బండిలో వజ్రాల బొమ్మతో బలే బలే | దాశరథి | బి.వసంత |
| 3 | ఏమివ్వగలదానరా? నాస్వామీ? నా తనువూ, నా మనసూ మునుపే ఇచ్చితిరా | దాశరథి | పి.సుశీల |
| 4 | కిలకిల నగవుల నవమోహినీ ప్రియకామినీ | దాశరథి | ఘంటసాల |
| 5 | ఇదేవేళ నావలపు నిన్నే కోరింది అదేవేళ నా తనువు నిన్నే చేరింది | శ్రీశ్రీ | ఘంటసాల, ఎస్.జానకి |
| 6 | ఇద్దరికి యీడు జోడు కుదిరెను ఇక జూడు | కొసరాజు | మాధవపెద్ది, స్వర్ణలత |
| 7 | దిగరా దిగరా నాగన్నా ఎగిరిపడకురా నాగన్నా | కొసరాజు | ఎస్.జానకి, పి.లీల |
| 8 | కొండలన్నీ వెదికేను కోనలన్నీ తిరిగేను సఖియా | దాశరథి | ఘంటసాల, ఎస్.జానకి |
| 9 | ఎదురు ఎదురు చూచిన రేయి ఇపుడె ఇపుడె వచ్చినదోయి | దాశరథి | పి.సుశీల |
| 10 | వసంత సుమమే వాడిపోయెనా? విషాదమొక్కటే మిగిలిపోయెనా? | శ్రీశ్రీ | మాధవపెద్ది బృందం |
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు, ఆంధ్రప్రభ (10 August 1967). "వసంతసేన ప్రత్యేకానుబంధ". ఆంధ్రప్రభ దినపత్రిక: 8. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 August 2016.[permanent dead link]
- ↑ స్వతంత్ర. వసంతసేన పాటలపుస్తకం. p. 8. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2020.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.