కాంచన (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కాంచన నటి కోసం కాంచన చూడండి.

కాంచన (సినిమా)
(1952 తెలుగు సినిమా)
Kancana cinema.jpg
దర్శకత్వం ఎస్.ఎమ్.శ్రీరాములు
తారాగణం కె.ఆర్.రామస్వామి,
లలిత,
పద్మిని,
ఎం.ఆర్.సంతానలక్ష్మి,
ఆర్.ఎస్.మనోహర్,
ఎం.ఎన్.నంబియార్,
టి.ఎస్.దురైరాజ్,
కుమారి తంగమ్,
పి.ఎస్.జ్ఞానమ్,
కె.దురైస్వామి,
ఎన్.ఎస్.నారాయణ పిళ్ళై,
ఎన్.కమలం
సంగీతం ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు
నిర్మాణ సంస్థ పక్షిరాజా స్టూడియోస్
భాష తెలుగు

కాంచన 1952లో విడుదలైన తెలుగు సాంఘీక చిత్రం. ఇది ఏకకాలంలో తెలుగు, తమిళం మరియు మళయాల భాషలలో నిర్మించబడింది. పక్షిరాజా పతాకంపై ఈ చిత్రాన్ని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు నిర్మించి దర్శకత్వం వహించాడు. మళయాలంలో ఈ సినిమా పేరు కాంజన[1] ఇది డా. త్రిపురాసుందరి అనే యువ వైద్యురాలు లక్ష్మీ అనే కలం పేరుతో వ్రాసిన ప్రసిద్ధ తమిళ నవల కాంచనయిన్ కనవుపై ఆధారితమైనది.[2] ఈ నవల ఆనంద వికటన్ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమై పాఠకుల ఆదరణ పొందింది[3] ఈ నవల యొక్క ప్రాచుర్యాన్ని గమనించి శ్రీరాములు నాయుడు ఈ కథను సినిమాగా తీయటానికి హక్కులు పొంది సినిమాను నిర్మించాడు.[4]

పాటలు[మార్చు]

ఇందులోని 10 పాటల్ని తోలేటి రచించారు.[5]

  1. ఇకపైన ఎపుడైనా వారికి నాకు సరిపోవదే పోవే -
  2. ఇదేనా ప్రేమతీరేనా యిలాగా నా జీవపడవము -
  3. ఓ ఓ ఓ ఏతాం ఎక్కేనే తోక్కేదా నీరూనించేద ఏతాంయిలాగ -
  4. ఓ మోహన రూపా నాదగు నాట్యము లోకములేలే ప్రేమ -
  5. చందమామ రావే అందాల రాశి రావే కొండమీద -
  6. చిన్నచిలకా పలికేనా చిందులాడే తేనెలూర -
  7. పరమపావనీ దయగనవే నీ పదముల నా మదిలో -
  8. ప్రేమసుమమాల కాలరాసేనే మేలివలపేల యిటుల -
  9. ప్రేమించితీ నిను ప్రియమోహనా నీ దాననే నిజముగా -
  10. మాయే-త్వమ్ యాహే మాంపాహి తుమ్ కాహి -

మూలాలు[మార్చు]