అట్లూరి పూర్ణచంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అట్లూరి పూర్ణచంద్రరావు
జననం(1925-04-04)1925 ఏప్రిల్ 4
వానపాముల గ్రామం, కృష్ణా జిల్లా
మరణం2017 అక్టోబరు 29(2017-10-29) (వయసు 92)
హైదరాబాదు
మరణ కారణంకాలేయ క్యాన్సర్
వృత్తిసినీ నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు
జీవిత భాగస్వామిమరుద్వతి
పిల్లలుఇద్దరు కుమారులు

అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగు, హిందీ చలనచిత్రాల నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, చౌటుపల్లి గ్రామంలో 1925వ సంవత్సరం ఏప్రిల్ 4న జన్మించాడు.[2] ఇతనికి చదువు అబ్బలేదు. ఎస్.ఎస్.సి ఫెయిల్ అయిన తర్వాత ఇంటి నుండి పారిపోయి విజయవాడలో ఒక కాంట్రాక్టర్ వద్ద మూడు నెలలు పనిచేశాడు. తర్వాత గుడివాడలోని గౌరీశంకర్ టాకీసులో ప్రొజెక్టర్ ఆపరేటింగ్ అసిస్టెంట్‌గా, బుకింగ్ క్లర్క్‌గా ఆరు నెలలు పనిచేశాడు. తర్వాత విజయవాడలోని నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలో ఐదు సంవత్సరాలు పనిచేశాడు. అదే సంస్థ గుంతకల్లు బ్రాంచి మేనేజరుగా కొంతకాలం పనిచేశాడు. తర్వాత మద్రాసుకు వెళ్లి బి.విఠలాచార్య, పి.పుల్లయ్యల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత మిత్రుల సలహాతో ప్రొడక్షన్ రంగంలోకి ప్రవేశించాడు. సినిమాలలో ప్రొడక్షన్ అసిస్టెంటుగా నాలుగు సంవత్సరాలు పనిచేసి మెళకువలు నేర్చుకున్నాడు.

సినీ నిర్మాణ రంగంలో[మార్చు]

ఇతడు 1964లో మొట్టమొదటగా అగ్గిమీద గుగ్గిలం చిత్రాన్ని ప్రారంభించాడు. నవభారత్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.ప్రకాశరావు 50వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ చిత్రం ప్రారంభం నుండి చివరివరకు పూర్ణచంద్రరావు చూసుకున్నా నిర్మాతగా ఇతని పేరు మొదటి ఐదు సినిమాలలో వేసుకోలేదు. ఇతడు తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలు, తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలు, భోజ్‌పురిలో ఒక చిత్రం నిర్మించాడు.

శరత్ బాబును సినీ నటుడిగా పరిచయం చేశాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రిని సినీ సంభాషణల రచయితగా వెండితెరకు పరిచయం చేశాడు.[1]

సినిమాల జాబితా[మార్చు]

  1. అగ్గిమీద గుగ్గిలం
  2. అపాయంలో ఉపాయం
  3. ఉక్కుపిడుగు
  4. గజదొంగ గంగన్న
  5. మాతృదేవత
  6. రైతు కుటుంబం
  7. రౌడీరాణి
  8. పాపం పసివాడు
  9. ప్రేమ పుస్తకం
  10. వెంకీ
  11. లోక్ పరలోక్ (హిందీ)
  12. మాంగ్ భరో సజనా (హిందీ)
  13. ఏక్ హీ భూల్ (హిందీ)
  14. అంధాకానూన్ (హిందీ)
  15. ఆఖరీరాస్తా (హిందీ)
  16. చాల్‌భాజ్ (హిందీ)
  17. దిల్ (తమిళ)
  18. యూత్ (తమిళ)
  19. ఇడియట్ (హిందీ)

మరణం[మార్చు]

కొంతకాలం కాలేయ క్యాన్సర్ తో బాధపడుతూ 2017, అక్టోబరు 29 న హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు.[3] ఈయన భార్య మరుద్వతి. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కన్నుమూత". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 30 October 2017. Retrieved 30 October 2017.
  2. నన్ను నేను నిరూపించుకోవాలి - అట్లూరి పూర్ణచంద్రరావు - ఆంధ్రజ్యోతి దినపత్రిక - సంచిక 13 ఫిబ్రవరి 2004[permanent dead link]
  3. ఆంధ్రజ్యోతి (30 October 2017). "అట్లూరికి కమ్యూనిస్టుల నివాళి". Retrieved 26 November 2017.[permanent dead link]