అగ్నిపూలు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్నిపూలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
నిర్మాణం డి.రామానాయుడు
రచన యద్దనపూడి సులోచనారాణి
తారాగణం జయసుధ,
కృష్ణంరాజు,
జయప్రద,
కైకాల సత్యనారాయణ,
శ్రీధర్,
అల్లు రామలింగయ్య,
జయంతి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
నిర్మలమ్మ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

యద్దనపూడి సులోచనారాణి ప్రసిద్ధ నవల 'అగ్నిపూలు'కు ఇది చిత్రరూపం. జేనీ గా జయసుధ, ఆమె బావగా కృష్ణంరాజు నటనకు మంచి పేరు వచ్చింది. బాపయ్య దర్శకత్వం వహించారు.

సంక్షిప్తకథ

[మార్చు]

రాజులు పోయినా, రాజ్యాలు పోయినా దర్పం పోని జమీందారు గోవిందవల్లభరాజా తన కొడుకు శివప్రసాద్ అమెరికాలో మేరీ అనే యువతిని పెండ్లి చేసుకుని, పిల్లలు జానీ, బాబీలతో ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని ఉగ్రుడయి కొడుకుతో తనకెలాంటి సంబంధమూ లేదని ప్రకటిస్తాడు. అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి ఆస్తినంతా కాజేయాలని నిర్ణయించుకుని గోవిందవల్లభరాజా ఉగ్రత్వానికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్‌ను, మేరీని అవుట్‌హౌస్‌లో ఉంచి అవమానం చేస్తారు. గోవిందవల్లభరాజా మృతదేహాన్ని కూడా చూడడానికి వారికి అనుమతించరు. కాలం గడుస్తుంది. విరూపాక్షి రాజా మరణిస్తాడు. అతని కొడుకు కృష్ణచైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. కృష్ణచైతన్య రుక్మిణి అనే అందమైన యువతిని వివాహం చేసుకుంటాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. గోవిందవల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై జానీ, బాబీ తాతగారి ఇంటికి వస్తారు. తన తల్లిదండ్రుల దారుణమరణానికి కారణమైన విరూపాక్షిరాజా కుటుంబంపై ముఖ్యంగా కృష్ణచైతన్య మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది జానీ. శాంతస్వభావుడైన కృష్ణచైతన్యకు జానీ చేష్టలు అర్థం కావు. జానీ దాచుకున్న మేరీ డైరీ కృష్ణచైతన్యకు దొరుకుతుంది. అది చదివిన కృష్ణచైతన్య తీసుకునే నిర్ణయం ఏమిటనేది పతాక సన్నివేశం.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అబ్బాయి అబ్బాయి నువ్వెంత అమ్మాయి చేతిలో - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. ఇది విస్కీ అది బ్రాంది ఏదైనా ఒకటే బ్రాంతి ఓం శాంతి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. కన్నెగా ఉన్ననురా స్వామి నిన్నే మనసారా ఎన్నిక గోన్ననురా - పి.సుశీల
  4. నమామి గణపతిం భజే ( పద్యం ) -
  5. ప్రియుడా పరకా ప్రియతమా పరకా వన్నె తేలిన కన్నె నాగు - పి.సుశీల
  6. వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

విశేషాలు

[మార్చు]
  • మైసూరులోని లలిత్ మహల్ ప్యాలెస్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. వి.ఆర్. (17 March 1981). "చిత్రసమీక్ష: అగ్నిపూలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 340. Retrieved 7 February 2018.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]