సుభాషిణి (నటి)
స్వరూపం
సుభాషిణి ఒక దక్షిణ భారత చలనచిత్ర నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినిమాలలో నటించింది. ఈమె ప్రముఖ నటి జయసుధ చెల్లెలు, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఈవిడకు మేనత్త. ఈమె అరుంధతి సినిమాలో విలన్ తల్లిగా నటించింది. ఇంకా నాగాస్త్రం, సుందరాకాండ మొదలైన టి.వి.సీరియళ్లలో కూడా నటించింది. ఈమె కూతురు పూజ పూరి జగన్నాథ్ సినిమా 143 లో ఒక చిన్న పాత్రను పోషించింది[1].
తెలుగు సినిమాల జాబితా
[మార్చు]సుభాషిణి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- శివరంజని (1978)
- ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)
- టైగర్ (1979)
- నిండు నూరేళ్ళు (1979)
- మా ఊళ్ళో మహాశివుడు (1979)
- ఆరని మంటలు (1980)
- మహాలక్ష్మి (1980)
- పటాలం పాండు (1981)
- డాక్టర్ సినీ యాక్టర్ (1982)
- మేఘ సందేశం (1982)
- సీతయ్య (2003)
- అరుంధతి (2009)
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుభాషిణి పేజీ