బాలమిత్రుల కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలమిత్రుల కథ
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వరప్రసాదరావు
నిర్మాణం ఎస్. వి. నరసింహారావు
తారాగణం జగ్గయ్య,
కృష్ణంరాజు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ గౌరి శేషు కంబైన్స్
భాష తెలుగు

బాలమిత్రుల కథ 1972 లో వచ్చిన తెలుసు సినిమా. కె. వరప్రసాదరావు దర్శకత్వంలో గౌరి శేషు కంబైన్స్ ఎస్న.వి.నరసింహారావు నిర్మించాడు. కొంగర జగ్గయ్య, కృష్ణంరాజు, గుమ్మడి, నాగభూషణం ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది విభిన్న సామాజిక హోదా కలిగిన ఇద్దరు పిల్లల స్నేహం, రాజకీయ గ్రామ నేపథ్యంలో వారి స్నేహానికి వారి గురువు ఇచ్చిన మద్దతు యొక్క కథ ఈ సినిమా.

ధర్మయ్య (మాస్టర్ దేవానంద్), సత్యం (మాస్టర్ సురేంద్ర) లు స్నేహితులు, భవానీ ప్రసాద్ ( జగ్గయ్య ) గారికి అభిమాన విద్యార్థులు. సత్యం ధనవంతుడైన భూషయ్య ( మిక్కిలినేని ) కుమారుడు. ధర్మయ్య కూలీ కోటయ్య ( గుమ్మడి వెంకటేశ్వర రావు ) కుమారుడు. నాగరాజు, అల్లరి పిల్లవాడు, గ్రామ ప్రెసిడెంటు పాపయ్య ( నాగభూషణం ) కుమారుడు. భూస్వాములు పాపయ్య, భూషయ్యల మధ్య శత్రుత్వం వారి పిల్లల జీవితాల్లో కూడా ప్రతిబింబిస్తుంది. సర్కస్ షో కోసం టిక్కెట్లు కొనే విషయంలో నాగరాజు సత్యంను సవాలు చేస్తాడు. సత్యం తన తల్లిదండ్రులు భూషయ్య, శాంతమ్మ (హేమలత) నుండి డబ్బు సంపాదించలేక పోతాడు. డబ్బు సంపాదించే ప్రణాళికలో భాగంగా, సత్యం ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మయ్య అబద్ధం చెబుతాడు. శాంతమ్మ ఆ వార్త విని షాక్‌తో చనిపోతుంది. దాంతో సత్యం, ధర్మయ్యలు మరలా అబద్ధం చెప్పకూడదని నిర్ణయించుకుంటారు.

అమ్మోనియా ఎరువులో ఉప్పు కలపడం గురించి ప్రసాద్ పాపయ్యపై కేసు పెడతాడు. ధర్మయ్య కలెక్టర్కు చెప్తాడు. ఇది పాపయ్య తన ప్రతిష్ఠ కోల్పోతాడు. కోటయ్యకి ఉద్యోగంపోతుంది. తన తండ్రి కోపం బారిన పడకుండా ఉండేందుకు ధర్మయ్య, ఇంటి నుండి తప్పించుకొని భూషయ్య పశువుల ఇంట్లో దాక్కున్నాడు. కోటయ్య తన కొడుకు కోసం వెతుకుతూ పశువుల పాకలోకి దీపంతో వస్తాడు. అక్కడ గడ్డి అంటుకుంటుంది. భూషయ్య ముఠా కోటయ్యను పట్టుకుని, పాపయ్యే అతణ్ణి పంపించి ఉంటాడని తప్పుగా అర్థం చేసుకుంటారు. సత్యం అత్డికి రక్షణగా వచ్చి కోటయ్యను కాపాడటానికి కలెక్టర్ ముందు ఆధారాలు ఇస్తాడు. ధర్మయ్య, సత్యంల మధ్య ఉన్న స్నేహం లోని గాఢతను, సత్యం పట్ల వారికున్న నిబద్ధతను గ్రామ పెద్దలు ఎవ్వరూ పాపయ్య, భూషయ్యమ్ కొటయ్యలతో సహా ఎవరూ అర్థం చేసుకోలేరు. సత్యం, ధర్మయ్య గ్రామం నుండి తప్పించుకొని నగరం వెళ్ళి, అక్కడ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. తన చిన్ననాటి స్నేహితుడు భాను ( కృష్ణరాజు ) నేతృత్వంలోని మిలిటెంట్ విప్లవకారులు పాపయ్యను చంపబోతున్నారని ప్రసాద్ తెలుసుకుంటాడు. అతను పాపయ్యకు సమాచారం ఇవ్వమని సత్యం, ధర్మయ్యలకు చెబుతాడు. ఉగ్రవాదులు పోలీసులకు పోరాటం జరిగి తిరుగుబాటు నాయకుడు గాయపడి పట్టుబడతాడు. గ్రామంలో ధర్మయ్య, సత్యం వంటి నిజాయితీపరులు ఉండాల్సిన అవసరాన్ని గ్రామ పెద్దలు భూషయ్య, పాపయ్య, కోటయ్యలు గుర్తించడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక సిబ్బంది

[మార్చు]

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Balamitrula Katha (బాలమిత్రుల కథ) 1972". ♫ tunes (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-10-30. Retrieved 2020-08-24.[permanent dead link]