శ్రీవిద్య (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీవిద్య
Srividya.jpg
జననం (1953-07-24) 1953 జూలై 24
మరణం 2006 అక్టోబరు 19 (2006-10-19)(వయసు 53)
తిరువనంతపురం, కేరళ

శ్రీవిద్య (తమిళం: ஸ்ரீவித்யா) (1953 జూలై 24 - 2006 అక్టోబరు 19) 1970లు, 1980లు, 1990లు మరియు 2000 ప్రారంభంలో ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. దీనితో పాటు ఆమె మంచి గాయని కూడా. తన వృత్తి జీవితం యొక్క తరువాతి భాగంలో ఆమె మలయాళం చిత్రములపై ధ్యాస పెట్టింది. పలు చిత్రాలలో తల్లిగా ఆమె నటన గొప్ప ప్రశంసలు అందుకుంది. శ్రీవిద్య వ్యక్తిగత జీవితమంతా విషాధభరితమైంది. రొమ్ము కాన్సర్ తో మరణించే వరకు ఆమె తన వృత్తిలో ఒడిదుడుకులు అన్నింటినీ నిబద్ధతతో ఎదుర్కుంది.

ప్రారంభ జీవితం[మార్చు]

శ్రీవిద్య 1953 జూలై 24న భారతదేశంలోని తమిళనాడులో ఉన్న చెన్నైలో, తమిళ చిత్ర హాస్య నటుడు కృష్ణమూర్తి మరియు కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎం. ఎల్. వసంతకుమారిలకు జన్మించింది. ఆమెకు శంకరరామన్ అనే సోదరుడు ఉన్నాడు. ఆమె పుట్టిన సంవత్సరం ఆమె తండ్రి ముఖ కండరాలపై ప్రభావం చూపే ఒక జబ్బు బారిన పడటంతో నటన నుండి విరమించుకోవలసి వచ్చింది.[1] ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంది. కుటుంబ ఆర్థిక అవసరాల కొరకు ఆమె తల్లి ఎక్కువ సమయం పనిచేసేది. తనకు పాలు పట్టటానికి కూడా తన తల్లికి సమయం ఉండేది కాదని శ్రీవిద్య ఒకప్పుడు పేర్కొంది.[1] శ్రీవిద్య చాలా చిన్న వయస్సులోనే నటనలో ప్రవేశించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె తల్లిదండ్రుల వివాహం సమస్యలను ఎదుర్కోవటంతో, శ్రీవిద్య యవ్వనం నాశనమైంది. U.S. లో ఉన్న ఒక శాస్త్రవేత్త నుండి ఆమె వివాహ ప్రతిపాదన అందుకుంది, కానీ ఆమె కుటుంబం ఎదుర్కుంటున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ వివాహం జరగలేదు.[1]

ప్రారంభ వృత్తిజీవితం[మార్చు]

శ్రీవిద్య P. సుబ్రమణ్యన్ దర్శకత్వం వహించిన కుమార సంభవం లోని ఒక నృత్య సన్నివేశంతో ఆమె మలయాళం చిత్రాలలో మరియు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం తాతా మనవడు (1972) తో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది.[2] చట్టంబిక్కవల చిత్రంలో ఆమె సత్యన్ సరసన నాయికగా నటించింది. A. విన్సెంట్ దర్శకత్వం వహించిన చెందా ఆమె ప్రజాభిమానాన్ని చూరగొంది. జూలీ చిత్రంతో పేరొందిన లక్ష్మి ఆమెకు సన్నిహితురాలు. మలయాళీ నటీమణి సీమకు ఆమె వస్త్రాల ఎంపికలో మరియు అలంకరణలో కూడా శ్రీవిద్య సహాయం చేసింది.

వృత్తి & జీవితం[మార్చు]

1970ల మధ్య కాలంలో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో బాగా నిలదొక్కుకుంది. ఆమె నూత్రుక్కు నూరు,సొల్లతాన్ నినక్కిరెన్ మరియు అపూర్వ రాగంగల్ వంటి చిత్రాలలో నటించింది. చివరి రెండు చిత్రాలకు K. బాలచందర్ దర్శకత్వం వహించారు. అపూర్వ రాగంగల్ (1975) చిత్రంలో ఆమె తమిళ చిత్రములలో అప్పటి వర్ధమాన నటులు మరియు ఇప్పటి సూపర్ స్టార్లు అయిన, రజినీకాంత్ మరియు కమల్ హాసన్ లతో నటించింది. ఈ చిత్రం ఆమె జీవితాన్నే మార్చివేసింది. ఆ చిత్రంలో ఆమె రజినీకాంత్ భార్యగా మరియు కమల్ హాసన్ ప్రేయసిగా నటించింది. ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఆమె కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. వారికి వారి కుటుంబముల సహకారం ఉన్నప్పటికీ, వారు విడిపోయారు. తరువాత ఆమె తన మలయాళం చిత్రం తీక్కనల్ సహాయ దర్శకుడు జార్జ్ థామస్ తో ప్రేమలో పడింది.[3] తన కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురైనా ఆమె అతనిని 1978 జనవరి 9న వివాహం చేసుకుంది. జార్జ్ కోరిక ప్రకారం, వివాహానికి ముందు ఆమె బాప్టిజం స్వీకరించింది. ఆమె ఒక గృహిణిగా ఉండాలని కోరుకుంది, కానీ ఆర్థిక సమస్యలను ఎత్తి చూపి జార్జ్ ఆమెను ఒత్తిడి చేసినప్పుడు, నటనకు తిరిగి రావలసి వచ్చింది. అతనిని వివాహం చేసుకోవటం ఒక తప్పుడు నిర్ణయం అని ఆమె వెంటనే గ్రహించింది. ఆమె కుటుంబ జీవితం దయనీయంగా తయారైంది మరియు ఆ వివాహం విడాకులతో ముగిసింది. తరువాత వారి మధ్య ఉన్న ఆర్థిక వివాదముల పరిష్కారం కొరకు చాలాకాలం పాటు చట్టబద్ధమైన పోరాటం జరిగింది. ఆ కేసు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది. అక్కడ అంతిమ తీర్పు ఆమెకే అనుకూలంగా వచ్చింది.[4] విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె చెన్నై వదిలి త్రివేండ్రంలో స్థిరపడింది.

శ్రీవిద్య ఒక మంచి గాయని కూడా. ఆమె మొదటిసారి అయలతే సుందరి అనే మలయాళ చిత్రంలో పాడింది. తరువాత ఆమె ఒరు పైన్కిలిక్కద మరియు నక్షత్ర తరట్టు వంటి పలు చిత్రములలో పాడింది. ఆమె ఒక నిపుణురాలైన శాస్త్రీయ వయోలిన్ కళాకారిణి కూడా. ఆమె సూర్య ఫెస్టివల్ వంటి వేడుకలలో పాడుతూ ఉండేది.

మరణం[మార్చు]

2003లో, శారీరిక ఇబ్బందుల తర్వాత ఆమె భయాప్సీ పరీక్ష చేయించుకుంది మరియు ఆమెకు రొమ్ము కాన్సర్ ఉన్నట్లు ధ్రువపడింది. ఆమెకు మూడు సంవత్సరముల పాటు చికిత్స జరిగింది. అక్టోబరు 2006లో, ఆమె రసాయన చికిత్స చేయించుకుంది. కానీ అప్పటికే కాన్సర్ ఆమె శరీరమంతటా వ్యాపించింది. 2006 అక్టోబరు 19న రాత్రి 7:55 సమయంలో ఆమె మరణించింది.[1]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

 • లండన్ 1838.
 • స్వప్నం కొండు తులాభారం (2003)
 • ముల్లవల్లియుం తెన్మావుం (2003)
 • మలయాళిమమను వణక్కం (2002)
 • కన్డుకొండైన్ కన్డుకొండైన్ (2000)
 • ఇంగనే ఒరు నిలపక్షి (2000)
 • అగ్నిసాక్షి (1999)
 • అరుంధతి (1999)
 • సంగమం (1999)
 • కన్నెతిరే తొండ్రినల్ (1998)
 • సిద్దార్ధ (1998)
 • చిన్నబ్బాయి (1997)
 • కాదలుక్కు మరియాదై (1997)
 • కృష్ణగుదియిల్ ఒరు ప్రణయకలతు (1997)
 • మానసం (1997)
 • పూనిలమళ (1997)
 • అనియతి ప్రవు (1997)
 • ధర్మ చక్రం (1996)
 • ది ప్రిన్స్ (1996)
 • ఢిల్లీవాల రాజకుమారన్ (1996)
 • ఏక్ అనారి దో ఖిలాడి (1996)
 • కాదల్ దేశం (1996)
 • నమ్మవార్ (1995)
 • గాండీవం (1994)
 • పవం ఇయ ఇవచన్ (1994)
 • పవిత్రం (1994)
 • ఓ' ఫేబి (1993)
 • ఉళైప్పాలి (1993)
 • బలరామ కృష్ణులు (1992)
 • దైవతింటే విక్రితికల్ (1992)
 • నీలగిరి (1991)
 • దళపతి (1991)
 • అద్వైతం (1991)
 • ఎంతే సూర్యపుత్రిక్కు (1991)
 • సామ్రాజ్యం (1990)
 • కొండవీటి దొంగ (1990)
 • అపూర్వ సగోధరర్గల్ (1989)
 • ఇన్నలే (1989)
 • మాప్పిలై (1989)
 • విక్కీ దాదా (1989)
 • జాలకం (1987)
 • స్వాతి తిరునాళ్ (1987)
 • ప్రణామం (1986)
 • క్షమిచు ఎన్నోరు వక్కు (1986)
 • ఎన్నేన్నుం కన్నేత్తంటే (1986)
 • ఇరకాల్ (1986)
 • పున్నగై మన్నన్ (1986)
 • వివాహితరే ఇతిహిలే (1986)
 • అయనం (1985)
 • అళియత బంధంగల్ (1985)
 • జనకీయ కొడతి (1985)
 • తిన్కలళ్చ నల్ల దివసం (1985)
 • అరంటే ముల్ల కోచు ముల్ల (1984)
 • అడమింటే వరియెల్లు (1983)
 • భూకంబం (1983)
 • కట్టతే కిలికూడు (1983)
 • పిన్ నిలవు (1983)
 • ప్రతిజ్ఞ (1983)
 • రచన (1983)
 • ఇతిరి నేరం ఒతిరి కార్యం (1982)
 • కెల్వియుం నానే బదిలుం నానే (1982)
 • ఆక్రమణం (1981)
 • అత్తిమరి (1981)
 • కతయరియతే (1981)
 • విల్కానుండు స్వప్నంగళ్ (1980)
 • శక్తి (1980)
 • తీక్కడల్ (1980)
 • అలావుద్దినం అద్భుత విలక్కుం (1979)
 • ఎడవలియిలే పూచ మింద పూచ (1979)
 • జీవితం ఒరు గానం (1979)
 • పుతియ వెలిచం (1979)
 • శ్రీ కృష్ణ లీల (1977)
 • హృదయం ఒరు క్షేత్రం (1976)
 • అర్జున్ పండిట్ (1976)
 • తూర్పు పడమర (1976)
 • అపూర్వ రాగంగల్ (1975)
 • జైసే కో తైసా (1973)
 • కట్టతే కిలికూడు
 • తాతా మనవడు ... నర్తకిగా (1972)

బాహ్య లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-09-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-25. Cite web requires |website= (help)
 2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-07-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-25. Cite web requires |website= (help)
 3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-09-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-25. Cite web requires |website= (help)
 4. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-09-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-25. Cite web requires |website= (help)