జీవితాశయం
Appearance
జీవితాశయం (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సప్తగిరి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
జీవితాశయం 1974లో విడుదలైన సినిమా. కృష్ణంరాజు, విజయనిర్మల ఇందులో ప్రధాన పాత్రధారులు.
తారాగణం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
- మాటలు: సముద్రాల రాఘవాచార్య
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
- నిర్మాతలు:వై.నరసింహస్వామి, కె.చెన్నవీరప్ప
సంక్షిప్తకథ
[మార్చు]జమీందారిణి రూపాదేవి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసి వైభవోపేతంగా జరపాలని అన్నీ సిద్ధం చేసిన తరుణంలో దురదృష్టవశాత్తూ ఆ పెళ్ళి తప్పిపోగా, రూపాదేవి అన్ని త్యజించి అభాగ్యులైన ఇద్దరు పిల్లలను చేరదీసి, వారిని పెంచి పెద్దచేసి, వారికి విద్యాబుద్ధులు నేర్పి, వాళ్ళను పైకి తీసుకురావడమే జీవితాశయంగా పెట్టుకున్న కథే ఈ జీవితాశయం సినిమా[1].
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు ఎస్.రాజేశ్వరరావు బాణీలు కట్టాడు. ఆ పాటల వివరాలు:[2]
- ఆటకు చెలో చెలో సయ్యాటకు చెలో చేలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
- ఈ లోకమే ఒక తమాషా ఎందరెందరో పడుచువాళ్లకు - ఎల్.ఆర్.ఈశ్వరి
- గొంతు పాడితే చాలునా గుండెలో రాగం ఉండాలి - పి.సుశీల
- చెక్ చెక్ చెక్ ఓ చిలకమ్మా టక్ టక్ టక్ గోరింకయ్య - బి.వసంత బృందం
- మాయలోకం మర్మమంతా తెలుసుకో కైపులోనే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ తుర్లపాటి (1 December 1974). "చిత్రసమీక్ష జీవితాశయం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 3 March 2020.[permanent dead link]
- ↑ కొల్లూరి భాస్కరరావు. "జీవితాశయం - 1974". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 3 మార్చి 2020. Retrieved 3 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)