నీకు నేను నాకు నువ్వు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీకు నేను నాకు నువ్వు
దర్శకత్వంరాజశేఖర్
రచనపరుచూరి సోదరులు
నిర్మాతదగ్గుబాటి సురేష్ బాబు
తారాగణంఉదయ్ కిరణ్
శ్రియా సరన్
కృష్ణంరాజు
సుమన్
ఛాయాగ్రహణంఎన్. కె. ఏకాంబరం
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
15 ఆగస్టు 2003 (2003-08-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నీకు నేను నాకు నువ్వు రాజశేఖర్ దర్శకత్వంలో 2003లో విడుదలైన సినిమా. ఇందులో ఉదయ్ కిరణ్, శ్రీయ ముఖ్య పాత్రలు ధరించగా, కృష్ణం రాజు, సుమన్, సుజాత తదితరుల ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాకు కుటుంబ సమేతంగా చూడదగ్గ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది.[2]

రాఘవయ్య (కృష్ణంరాజు) ఓ పేరున్న పారిశ్రామికవేత్త. ఆయనకు ఓ కూతురు (మీనాకుమారి) ఉంటుంది. రాఘవయ్య కంపెనీలో పని చేసే ఒక ఉద్యోగి చనిపోవడంతో అతని కొడుకు ప్రసాద్ (సుమన్) చదువుకు రాఘవయ్య సహాయం చేస్తాడు. ప్రసాద్ రాఘవయ్య కూతురితో ప్రేమలో పడి ఆమెను పెళ్ళి చేసుకుని లండన్ వెళ్ళి స్థిరపడిపోతాడు. వారికి సీతు అలియాస్ సీతా లక్ష్మి (శ్రీయ) అనే కూతురు పుడుతుంది.

ఈ లోగా రాఘవయ్య ఓ అనాథాశ్రమం నుంచి ఓ అబ్బాయిని తెచ్చి పెంచుకుని అతనికి ఆనంద్ (ఉదయ్ కిరణ్) అని పేరు పెడతాడు. తన కూతురు తనతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంగా రాఘవయ్య ప్రేమికులున్నా, ప్రేమన్నా ద్వేషంతో ఉంటాడు. ఈ లోపు రాఘవయ్య కూతురు అనారోగ్యం కారణంగా చనిపోతుంది. కొద్ది సంవత్సరాల తర్వాత ప్రసాద్, తన కుతురు సీతుతో కలిసి హైదరాబాదుకు వచ్చేస్తారు. అక్కడ ఆనంద్ తనను పెంచిన తండ్రి అంటే ఎంతో గౌరవాభిమానాలతో ఆయన మనస్సు నొప్పించకుండా చూస్తుంటాడు. సీతూ, ఆనంద్ ఇద్దరూ ప్రేమలో పడతారు. రాఘవయ్యకు ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది. అసలే ప్రేమ వివాహాలంటే పడని రాఘవయ్య వీరిద్దరి ప్రేమను అంగీకరించాడా లేదా అన్నది మిగతా కథ.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్నందించాడు.[3] వేటూరి సుందర్రామ్మూర్తి, పెద్దాడ మూర్తి, చంద్రబోస్, కులశేఖర్, చైతన్య ప్రసాద్ పాటలు రాశారు. ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం, శంకర్ మహదేవన్, ఎస్. పి. చరణ్, ఉదిత్ నారాయణ్, ఉష, చిత్ర, కెకె, రాజేష్ పాటలు పాడారు.[4]

పాట పాడిన వారు రాసిన వారు
గోల్ గోల్ ఉదిత్ నారాయణ్, ఉష చంద్రబోస్
గుమ్మారే గుమ్మారే కెకె, ఉష
నా చిరునామా కె. ఎస్. చిత్ర, రాజేష్ పెద్దాడ మూర్తి
నేను నీకెవరని ఉష, కార్తీక్ వేటూరి సుందర్రామ్మూరి
పెళ్ళాడి తీరాలన్నారు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర చైతన్య ప్రసాద్
ప్రేమకన్నా గొప్పదింక శంకర్ మహదేవన్, కె. ఎస్. చిత్ర కులశేఖర్
తెలుగు భాష తియ్యదనం ఎస్. పి. చరణ్ చంద్రబోస్

మూలాలు

[మార్చు]
  1. గుడిపూడి, శ్రీహరి. "Playing on emotions". thehindu.com. ది హిందు. Retrieved 24 November 2016.
  2. జీవి, రమణ. "2003 నంది పురస్కారాల విజేతల జాబితా". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 24 November 2016.
  3. "నీకు నేను నాకు నువ్వు పాటలు". naasongs.com. naasongs.com. Archived from the original on 19 నవంబరు 2016. Retrieved 24 November 2016.
  4. "రాగ.కాం లో నీకు నేను నాకు నువ్వు పాటలు". raaga.com. raaga.com. Retrieved 24 November 2016.

బయటి లింకులు

[మార్చు]