దగ్గుబాటి సురేష్‌బాబు

వికీపీడియా నుండి
(దగ్గుబాటి సురేష్ బాబు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దగ్గుబాటి సురేష్ బాబు
జననం(-12-24) డిసెంబరు 24 [1]
ఇండియా
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారత దేశము
విద్యాసంస్థలుమిచిగాన్ విశ్వవిద్యాలయం
వృత్తిసినీ నిర్మాత
పిల్లలుదగ్గుబాటి రానా[2]
Malavika[3]
Abhiram[4]
తల్లిదండ్రులుదగ్గుబాటి రామానాయుడు[5]
దగ్గుబాటి రాజేశ్వరి

దగ్గుబాటి సురేష్ బాబు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత.[6] సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బొబ్బిలి రాజా, కూలీ నెం 1, ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు లేక నేను లేన, మల్లీశ్వరి, తులసి, దృశ్యం, గోపాల గోపాల తదితర చిత్రాలను నిర్మించారు.

చిన్నతనం[మార్చు]

సురేష్ బాబు ప్రఖ్యాత నిర్మాత, మూవీమొఘల్‌గా పేరుగాంచిన డి.రామానాయుడు కుమారుడు. మద్రాసులోని డాన్ బాస్కో పాఠశాలలో పాఠశాల విద్య పూర్తిచేశారు. ఆయన చెన్నైలోని లయోలా కళాశాలలో పీయూసీ పూర్తిచేశారు. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, 1981లో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు.[5]

నిర్మాణ రంగం[మార్చు]

చిత్రనిర్మాణ రంగంలోకి 1982లోనే దేవతతో అడుగుపెట్టినా బొబ్బిలి రాజా సినిమాతోనే ఆయన పేరును నిర్మాతగా వేసుకోవడం ప్రారంభించారు.[5]

ఇతర కార్యకలాపాలు[మార్చు]

2011-12 సంవత్సరానికి గాను ఎ పి ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షునిగా వ్యవహరించారు.[6]

వంశవృక్షం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "D Suresh Babu birthday 2010 celebrations". idlebrain.com. 24 December 2010. Retrieved 11 February 2013.
  2. "Rana to debut with 'Leader'". entertainment.in.msn.com. 25 September 2009. Archived from the original on 29 సెప్టెంబర్ 2009. Retrieved 11 February 2013.
  3. "Daggubati Malavika to get married today". indiatimes.com. 5 December 2012. Retrieved 11 February 2013.
  4. "Abhiram Daggubati Manhandles Ravi Teja". teluguone.com. 4 January 2013. Retrieved 11 February 2013.
  5. 5.0 5.1 5.2 "Interview with D Suresh Babu by Jeevi". idlebrain.com. 8 January 2002. Retrieved 1 April 2013.
  6. 6.0 6.1 "Suresh Babu to head film chamber". The Times of India. 31 July 2011. Retrieved 9 November 2011.

బయటి లంకెలు[మార్చు]