తులసి (2007 సినిమా)
తులసి (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోయపాటి శ్రీను |
---|---|
తారాగణం | దగ్గుబాటి వెంకటేష్, నయనతార, రమ్యకృష్ణ, శివాజీ, అలీ, రాహుల్ దేవ్, సుబ్బరాజు |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
సంభాషణలు | పరుచూరి బ్రదర్స్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 12 అక్టోబర్ 2007 |
నిడివి | 153 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తులసి 2007, అక్టోబరు 12న విడుదలైన తెలుగు చలన చిత్రం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్, నయనతార, రమ్య కృష్ణ, శివాజీ, ఆలీ, రాహుల్ దేవ్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వెంకటేష్ కథానాయకుడుగా నటించి విజయం సాధించిన చిత్రం, అంతే గాక లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి విజయాలతో దూసుకుపోతున్న వెంకటేష్ కు హ్యాట్రిక్ ను అందించిన చిత్రం.
కథ
[మార్చు]తులసి (వెంకటేష్) చాలా తమషా అందరిని ఆటపటిస్తు వుంటాడు.. యూరోఫ్ ట్రిఫ్ లో తనతో పాటు ప్రయాణిస్తున్న వసుంధర (నయనతార) ప్రేమలో పడతాడు. వాళ్ళు అందరినీ ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు. తులసి తన ఊరు ఫ్యాక్షన్, కక్షలుతో కురుకుపోయివుంటుంది. ఆలాంటి ఊరిలో తులసి కుటుంబం కూడా ఒకరితొ (జయ ప్రకాష్ రెడ్డి) ఫ్యామిలో గోడవలలో ఉంటుంది. అదే సమయంలో పౌర ఎన్నికలలో తులసి నాన్నా (విజమ్ కుమారు) గెలుస్తాడు... ఆ గెలుపు సహించలేని తమ శత్రువులు తులసి కుటుంబానికి సంబందిన వారిని చంపాడానికి వస్తారు ఆ గోడవలలో వసుంధర తమ్ముడు (శివాజి) మరణిస్తాడు. అప్పటి నుంచి వసుంధర అలాంటి వాతావరణం అంటే భయపడుతుంటుంది...తులసి నుంచి తన కోడుకు తీసుకోని దూరంగా పోతుంది.. కాని తులసి కోడుకుని చంపాలని కోంత మంది రౌడీలు చూస్తారు... వారి నుండి తన భార్యను కోడుకు ఎలా కాపాడుకుంటాడు అలాగే తన వాళ్ళు చంపాలనుకుంటున్న వారిని ఎలా చంపుతాడు అనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- దగ్గుబాటి వెంకటేష్
- నయనతార
- రమ్య కృష్ణ
- శివాజీ
- ఆశిష్ విద్యార్థి
- అలీ
- రాహుల్ దేవ్
- సుబ్బరాజు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: బోయపాటి శ్రీను
- నిర్మాత: దగ్గుబాటి సురేష్‌బాబు
- సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
పాటలు
[మార్చు]- నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే సూర్యోదయం , రచన: భాస్కర భట్ల, గానం. చిత్ర, సాగర్
- మియా మియా , రచన: చంద్రబోస్ , గానం.నవీన్ , మమతా మోహన్ దాస్
- వెన్నెలింత వేడిగా , రచన: చంద్రబోస్, గానం.వేణు, సునీత
- తుల తుల తులసి , రచన: చంద్రబోస్ , గానం.టిప్పు , ప్రియహిమేశ్ .
- హాల్లో బాయ్స్ , రచన:చంద్రకాంత్ , గానం.దేవీశ్రీ ప్రసాద్
- నే చుక్ చుక్ బండిని , రచన: సాహితీ , గానం.దేవీశ్రీ ప్రసాద్ , మాల్గాడి శుభ .