Jump to content

రేఖ (హిందీ నటి)

వికీపీడియా నుండి
రేఖ
కెమెరా ముందు నవ్వుతూ రేఖ
2019లో స్క్రీన్ అవార్డ్స్ లో రేఖ
జననం
భానురేఖ గణేశన్

(1954-10-10) 1954 అక్టోబరు 10 (వయసు 70)
మద్రాస్, మద్రాస్ రాష్ట్రం, భారతదేశం
ఇతర పేర్లురేఖా అగర్వాల్[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1958–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ముఖేష్ అగర్వాల్
(m. 1990; died 1990)
తల్లిదండ్రులు
బంధువులు
సన్మానాలుపద్మశ్రీ (2010)
సంతకం

రేఖ (జననం 1954 అక్టోబరు 10)గా సుపరిచితులైన భానురేఖ గణేశన్ హిందీ చిత్రాలలో ప్రధానంగా కనిపించే భారతీయ నటి. ఆమె భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె దాదాపుగా 200 చిత్రాలలో నటించింది. ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. భారత ప్రభుత్వం ఆమెను 2010లో భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.

ప్రముఖ నటులు పుష్పవల్లి, జెమినీ గణేశన్ ల కుమార్తె రేఖ. తన కెరీర్‌ను వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించబడిన ఇంటి గుట్టు (1958), రంగుల రాట్నం (1966) చిత్రాలలో బాల నటిగా ప్రారంభించింది. కన్నడ చిత్రం ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి C.I.D 999 (1969)తో ఆమె కథానాయికగా మొదటి చిత్రం చేసింది. సావన్ భాడోన్ (1970)తో రేఖ హిందీ అరంగేట్రం ఆమెను వర్ధమాన తారగా నిలబెట్టింది. ఘర్, ముఖద్దర్ కా సికందర్‌లలో ఆమె నటనకు 1978లో మంచి గుర్తింపు లభించింది. ఆ చిత్రాలు ఆమె కెరీర్‌లో అత్యంత విజయవంతమైన కాలానికి నాంది పలికినట్టయింది. 1980లు, 1990ల ప్రారంభంలో ఆమె హిందీ సినిమా ప్రముఖ తారలలో ఒకరు.

ఖుబ్సూరత్ (1980)లో ఆమె నటనకు ఉత్తమ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆమె బసేరా (1981), ఏక్ హి భూల్ (1981), జీవన్ ధార (1982), అగర్ తుమ్ నా హోతే (1983) చిత్రాలతో మరింత జనాదరణ పొందింది. వీటికి భిన్నంగా కలియుగ్ (1981), విజేత (1982), ఉత్సవ్ (1984) వంటి చిత్రాలలో నటించి ఆమె మెప్పించింది. ఉమ్రావ్ జాన్ (1981)లో ఆమె ఒక వేశ్య పాత్రను పోషించడం వలన ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఖూన్ భారీ మాంగ్ (1988)తో మహిళా-కేంద్రీకృత ప్రతీకార చిత్రాల కొత్త ఒరవడికి నాయకత్వం వహించిన నటీమణులలో ఆమె కూడా ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నది. దీనికి ఆమె ఫిల్మ్‌ఫేర్‌లో రెండవ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

ఆమె 1996లో యాక్షన్ థ్రిల్లర్ ఖిలాడియోన్ కా ఖిలాడి (1996)లో అండర్ వరల్డ్ డాన్ పాత్రలో నటించి ఉత్తమ సహాయ నటి విభాగంలో మూడవ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. కామ సూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్ (1996), ఆస్తా: ఇన్ ది ప్రిజన్ ఆఫ్ స్ప్రింగ్ (1997) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె 2001లో జుబేదా, లజ్జాలో ఆమె సహాయక పాత్రలకు ప్రశంసలు అందుకుంది. ఇక తల్లి పాత్రలు పోషించడం ప్రారంభించింది, వీటిలో ఆమె సైన్స్ ఫిక్షన్ కోయి... మిల్ గయా (2003), దాని సూపర్ క్రిష్ (2006).. రెండూ వాణిజ్య విజయాలు సాధిచాయి. పైగా రెండోది ఆమె అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది.

రేఖ నటనతో పాటు 2012లో రాజ్యసభకు సభ్యురాలిగా ఎన్నుకోబడ్డారు.[2]

మూలాలు

[మార్చు]
  1. Usman 2016, p. 13.
  2. "Rekha Takes Oath in Rajya Sabha | Rekha in Parliament - YouTube". web.archive.org. 2022-11-01. Archived from the original on 2022-11-01. Retrieved 2022-11-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)