పుష్పవల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Pushpavalli mohini.jpg
పెంపుడు కొడుకు చిత్రంలో పుష్పవల్లి (ఆంధ్రపత్రిక ముఖచిత్రం)

పెంటపాడు పుష్పవల్లి, అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేశన్ భార్య, ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ యొక్క తల్లి.

విశేషాలు[మార్చు]

ఈమె తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926, జనవరి 3వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదవ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు వెంకట పుష్పవల్లి తాయారు. ఈమెకు పిన్నవయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి సంపూర్ణరామాయణం సినిమాలో సీత వేషం వేసింది. తరువాత దశావతారములు సినిమాలో మోహిని పాత్ర ధరించింది. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశం లభించింది. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో విరివిగా నటించింది. ఈమె చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమా నటిగా రాణించింది. ఆమె వేదాంతం రాఘవయ్యను వివాహం చేసుకుంది. పుష్పవల్లి జెమినీ గణేశన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పటికే జెమినీ గణేశన్‌కు పెళ్ళి అయింది. ఈమె కూడా ఈ పెళ్ళికి ముందు రంగాచారిని వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్ళి మూడునాళ్ల ముచ్చట అయ్యింది. జెమినీ గణేశన్‌కు ఈమెకు బాబ్జీ, భానురేఖ, రమ, రాధ, ధనలక్ష్మి అనే సంతానం కలిగారు. వీరిలో భానురేఖ రేఖ పేరుతో హిందీ సినిమా రంగంలో ఒక తారగా వెలుగునొందింది. పుష్పవల్లి జెమినీ గణేశన్‌ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఈమె 1992 మే 11న మరణించింది.

కొన్ని వివాదాల గురించి రూపవాణి పత్రికకు పుష్పవల్లి వ్రాసిన ఒక లేఖను ఇక్కడ చూడవచ్చును. [1][permanent dead link]

చిత్ర సమాహారం[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]