Jump to content

పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా)

వికీపీడియా నుండి
పాదుకా పట్టాభిషేకం
(1945 తెలుగు సినిమా)
దర్శకత్వం కడారు నాగభూషణం
నిర్మాణం కడారు నాగభూషణం
కథ పానుగంటి లక్ష్మీనరసింహం
తారాగణం సి.ఎస్.ఆర్.ఆంజనేయులు,
బందా కనకలింగేశ్వరరావు,
పసుపులేటి కన్నాంబ,
పెంటపాడు పుష్పవల్లి,
అద్దంకి శ్రీరామమూర్తి,
దాసరి కోటిరత్నం,
తాడంకి శేషమాంబ,
రఘురామయ్య,
ఆరణి,
పారుపల్లి,
కళ్యాణి,
సత్యనారాయణ
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
గీతరచన అద్దంకి శ్రీరామమూర్తి
సంభాషణలు శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
కళ శేఖర్
నిర్మాణ సంస్థ రాజరాజేశ్వరీ ప్రొడక్షన్స్,
జెమినీ పిక్చర్స్
భాష తెలుగు

పాదుకా పట్టాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ పతాకాన కె.బి. నాగభూషణం దర్శకత్వంలో 1945లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అద్దంకి, సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు, బందా కనకలింగేశ్వరరావు, కొచ్చర్లకోట, ప్రయాగ, పారుపల్లి సత్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు, రఘురామయ్య, కన్నాంబ, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, శేషుమాంబ, చంద్రకళ, అన్నపూర్ణ , అంజనీబాయి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 15-3-1945న విడుదల చేసారు.[1]

శ్రీరాముని పట్టాభిషిక్తుడుని చేయాలనుకున్న తరుణంలో మంధర మాట విని కైక దశరథుని మూడు వరాలు అడగటం, వాటిలో రాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం వంటివి కావడం, మొదటిది జరిగాక భరతుడు వచ్చి తల్లిని నిందించి అడవికి వెళ్ళి రాముని బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం ఈ చిత్ర ఇతివృత్తం.

ఈ చిత్రానికి మాటలు పానుగంటి నరసింహారావు, శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి, పాటలు బి.టి. నరసింహాచారి, ప్రయాగ ఛాయాగ్రహణం కమల్‌ ఘోష్‌ నిర్వహించారు. జెమినీ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్‌ జరిగింది.

పాత్రలు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటల/పద్యాల వివరాలు:[2]

క్ర.సం. పాట/పద్యం పాడినవారు
1 గైకొనుమిదె దేవా కరుణారతి సుమసేవా దాసరి కోటిరత్నం
2 స్దిరమైన నడవడి నరులకందరకును వలయును (పద్యం) సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
3 శ్రీహరి విలాసమే జగము శ్రీహరి కటాక్షమె కె.రఘురామయ్య
4 అజ రుద్ర విష్ణుల ఆకృతులన్ లోక వారంబులం (పద్యం) పారుపల్లి సత్యనారాయణ
5 ఎవ్వాని తాపసి కీయ నేడ్చితినని యింతదూర ముపన్యసించినానో (పద్యం) అద్దంకి శ్రీరామమూర్తి
6 ఏమే శారికా ఏమే శారికా శారికా ఏది పాడవే ఏది పాడవే పసుపులేటి కన్నాంబ
7 చండాలుడను మదాంధుడ జడుడ కాంతా జనతా లోల (పద్యం) అద్దంకి శ్రీరామమూర్తి
8 చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై (పద్యం) అద్దంకి శ్రీరామమూర్తి
9 తల్లివి కావు నీవు చెడుదాయవు నాకు నృశంసతామతీ (పద్యం) బందా కనకలింగేశ్వరరావు
10 పతిపదసేవా భాగ్యమే సతులకు పరమపదంబౌ పుష్పవల్లి
11 రమణులార మన రామునికిపుడే మంగళ స్నానం దాసరి కోటిరత్నం
12 రావలదటంచు బలుకకో రామచంద్రా నిన్ను విడనాడి (పద్యం) కొచ్చెర్లకోట
13 శుభదినమిదియే యౌనుగా శోభమీరేనుగా మా వంశ దాసరి కోటిరత్నం
14 శ్రీరామచంద్రులకు పట్టాభిషేకమట రండోయి పోదాము బృందం
15 సన్నుతింపరే శ్రీ రఘురాముని సీతారాముని బృందం
16 సర్వగుణ సంపూర్ణుడగు నిన్నునరుడు దైవముగాగ (పద్యం) అద్దంకి శ్రీరామమూర్తి
17 శ్రీరామ రామా రఘురామా శ్రీరామరామ జయరామా బందా కనకలింగేశ్వరరావు బృందం
18 వెఱ్ఱిరాముడు యువసతి న్వీడలేక భీకర పలాశసాంద్రా (పద్యం) సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
19 రామాభిషేకమో రామభిషేకమో యని పలవించిన యట్టి (పద్యం) బందా కనకలింగేశ్వరరావు
20 రామ రామ జయ రామా రామ రామ రఘురామా బృందం
21 మునుల తప:ఫలంబున మోక్ష మోసంగే (పద్యం) కె.రఘురామయ్య
22 భాగ్యవతిని కానా నే సౌభాగ్య వతిని కానా నా పతి రఘువు పుష్పవల్లి
23 పాపఫలాంతవై భవ భార మానక పుణ్యకాననముకు (పద్యం) సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
24 నీవు మనుష్య మాత్రుడవే నిన్ను పితృవ్యధలంట (పద్యం) పారుపల్లి సత్యనారాయణ
25 తరణికులమున నుదయించి తమ్ముడా (పద్యం) సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
26 చిన్నోడా పడవ తోయిరా పెద్దోడా బేగి ఏలేసా బృందం

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1945లో కాసులు కురిపించిన స్వర్గసీమ,మాయాలోకం - ఆంధ్రప్రభ మార్చి 24, 2011[permanent dead link]
  2. కొల్లూరు భాస్కరరావు. "పాదుకా పట్టాభిషేకం - 1945". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 2 ఏప్రిల్ 2020. Retrieved 2 April 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)