మాలతీ మాధవం (1940 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలతీ మాధవం
(1940 తెలుగు సినిమా)
Malathi Madhavam 1940 poster.jpg
మాలతీమాధవం సినిమా పోస్టర్
దర్శకత్వం చిత్తజల్లు పుల్లయ్య
తారాగణం పాలువాయి భానుమతి,
పెంటపాడు పుష్పవల్లి,
రేలంగి వెంకటరామయ్య,
కస్తూరి శివరావు
కళ్యాణి
నిర్మాణ సంస్థ మెట్రో పోలిటన్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

1940లో విడుదలైన ఈ చిత్రం భానుమతి రెండవ చిత్రం. అమాయక పిల్లైన మాలతి పాత్రలో నటించింది. ఈ సినిమాలో భానుమతి నటించడానికి బలిజేపల్లి, రేలంగి, శివరావు ప్రభృతులు ఆమె తండ్రి ఒత్తిడి తేగా అయిష్టంగా అంగీకరించింది.[1]

సి. పుల్లయ్య దర్శకత్వంలో భవభూతి రాసిన కావ్యం ఆధారంగా కవిరాజు రాసిన సంభాషణలు పాటలతో 'మాలతీ మాధవం' రూపొందింది. ముగ్ద లాంటి మాలతి పాత్రకి భానుమతిని ఆమె సరసన మాధవుడుగా హీరో పాత్రలో శ్రీనివాసరావు, మరో పాత్రలో పుష్పవల్లి నటించారు. ఈ చిత్రానికి కలకత్తా న్యూ థియేటర్‌ స్టూడియోలో ఇండోర్‌ షూటింగ్‌, కలకత్తాలోని బొటానికల్‌ గార్డెన్స్‌లో ఔట్‌డోర్‌ షూటింగ్‌ చేశారు. 'మాలతీ మాధవం' చిత్రం ఆర్థిక సమస్యలతో రూపొందింది. ఈ చిత్రం ద్వారా భానుమతికి పేరొచ్చింది కానీ సినిమా విజయం సాధించలేదు.[2]

మూలాలు[మార్చు]