పింగళ కల్యాణి (సీతారావమ్మ)
పింగళ కల్యాణి | |
---|---|
జననం | సీతారావమ్మ 1918 మమిళ్లపల్లి, తెనాలి, గుంటూరు జిల్లా |
మరణం | 1996 |
ఇతర పేర్లు | సీతారావమ్మ |
ప్రసిద్ధి | రంగస్థల, సినిమా నటి, గాయని. |
తండ్రి | పింగళ సుబ్బారాయుడు |
తల్లి | అన్నపూర్ణ |
పింగళ కళ్యాణి ప్రముఖ రంగస్థల, సినిమా నటి, గాయని.
జననం
[మార్చు]కల్యాణి 1918లో మమిళ్లపల్లి పింగళ సుబ్బారాయుడు, అన్నపూర్ణ దంపతులకు జన్మించారు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]పద్యాలు, పాటలు అవలీలగా పాడగలిగిన ఈమెను డా. చంద్రమౌళి సత్యనారాయణ ప్రోత్సహించి రంగస్థలానికి తీసుకొచ్చారు. పౌరాణిక, చారిత్రక నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా ముంబాయ్, కలకత్తా, చెన్నై, బెంగుళూర్, ఒరిస్సా మొదలైన ప్రాంతాలలో నాటకాలు ప్రదర్శించారు. నటిగా కొన్ని సినిమాలలో నటించి మరలా తెనాలి వచ్చి, అగ్రనటులతో నాటకాలలో నటించారు.
నటించిన నాటకాలు
[మార్చు]- చాణుక్య చంద్రగుప్త
- ఖిల్లీ రాజ్య పతనం
- బొబ్బిలి
- పాదుకా పట్టాభిఫేకం
- రాణీరుద్రమ
వంటి నాటకాలలో ప్రధాన పాత్రలు ధరించారు.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]ఈవిడ సినీరంగ ప్రవేశం విచిత్రంగా జరిగింది. చంద్రమౌళి నాటకాలలో నటిస్తున్న కళ్యాణిని చూసిన సముద్రాల రాఘవాచార్య తనను సినిమాలో నటింపచేయడానికి మద్రాస్ కి తీసుకెళ్లి బి.యన్.రెడ్డి కి పరిచయం చేసారు. తను తీసే సినిమాలలో కనీసం ఒక్కరైనా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనేది బి.ఎన్.రెడ్డి నియమం. అలా ఆయన సీతారావమ్మను, కళ్యాణి గా పేరుమార్చి వందేమాతరం సినిమాలో రెండవ కథానాయిక పాత్రకు తీసుకున్నారు. ఈ సినిమాలో కళ్యాణి తన పాటలు తానే పాడుకున్నారు. ఈ సినిమాతో సినీనటిగా స్థిరపడ్డారు.
నటించిన సినిమాలు
[మార్చు]వంటి దాదాపు 12 సినిమాల్లో నటించారు.
ఇతర వివరాలు
[మార్చు]సినిమాలు, నాటకాలో వాసి తగ్గిందని, కళారాధన కనిపించడంలేదని ఎప్పుడూ చెబుతుండేవారు. చివరి దశలో వీరి జీవితం కఠినంగా గడిచింది. ప్రభుత్వం వారు నెలకు రూ. 150/- ఇచ్చేవారు.
మరణం
[మార్చు]78 సంవత్సరాల వయసులో 1996లో మరణించారు.
మూలాలు
[మార్చు]- పింగళ కల్యాణి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వరశర్మ, పుట. 151.